For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Infosys Hirings: ఇన్ఫోసిస్ భారీ రిక్రూట్‌మెంట్స్.. TCS, Wipro, HCLలను వెనక్కి నెట్టి.. జీతాల పెంపు..

|

Infosys: ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకు ఇన్ఫోసిస్ శుభవార్త తెలిపింది. ఈ ఏడాది కంపెనీ తన రిక్రూట్‌మెంట్ లక్ష్యాన్ని మరింత పెంచుకుంది. దీని ప్రకారం మరిన్ని నియామకాలు ఉంటాయని వెల్లడించింది.

 ప్రత్యర్థులకంటే ఎక్కువగా నియామకాలు..

ప్రత్యర్థులకంటే ఎక్కువగా నియామకాలు..

ఇన్ఫోసిస్ ఇప్పటికే దాని వ్యాపార ప్రత్యర్థులైన TCS, Wipro, HCL టెక్‌లతో పోలిస్తే మెుదటి క్వార్టర్ లో అత్యధికంగా నియామకాలను చేసుకుంది. చివరి త్రైమాసికంలో రిక్రూట్‌మెంట్‌లు కొంచెం నెమ్మదించాయి. 2023 క్యూ1లో ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 3,35,186కి చేరుకుంది. కంపెనీ 21,171 మంది ఉద్యోగులను నికర ప్రాతిపధికన కంపెనీలోకి చేర్చుకుంది. అంతకు ముందు.. మార్చి క్వార్టర్ నాటికి కంపెనీలో 3,14,015 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే.. మార్చి త్రైమాసికంలో కంపెనీ 21,948 మందిని నియమించుకుంది.

50 వేల ఉద్యోగాలు..

50 వేల ఉద్యోగాలు..

ఇన్ఫోసిస్ ప్రత్యర్థి కంపెనీలైన విప్రో 15,331 మందిని, టీసీఎస్ 14,136 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. ఈ రెండింటితో పోలిస్తే ఇన్ఫోసిస్ మాత్రం భారీస్థాయిలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. ఈ మూడు కంపెనీలు కలిపి సుమారు 50 వేల మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి.

 ఐటీ కంపెనీల్లో టాలెంట్ వార్.

ఐటీ కంపెనీల్లో టాలెంట్ వార్.

.

విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ మూడు కలిపి టెక్ దిగ్గజాల్లో పనిచేస్తున్న మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా జూన్ చివరి నాటికి 11.65 లక్షలకు చేరుకుంది. ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 మధ్య కాలంలో ఈ ఐటీ కంపెనీలు నికరంగా 2 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు ఈ కంపెనీలు ప్రకటించిన ఫలితాల ద్వారా వెల్లడైంది. దీంతో ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో టాలెంట్ వార్ నడుస్తోంది.

 ఉద్యోగుల జీతాల పెంపు..

ఉద్యోగుల జీతాల పెంపు..

ప్రత్యర్థి కంపెనీలతో పోల్చితే తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కాంపిటీటివ్ రేంజ్‌లో పరిహారాన్ని కూడా ఇన్ఫోసిస్ పెంచింది. ఉద్యోగులకు జీతాల పెంపు, నియామక లక్ష్యాల పెరుగుదల స్వల్పకాలంలో కంపెనీ మార్జిన్లను ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ చర్యలతో ఉద్యోగుల వలసల రేటును భారీగా తగ్గించగలవని ఇన్ఫోసిస్ భావిస్తోంది. జూన్ 30, 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి వలసల రేటు 70 బేసిస్ పాయింట్లు పెరిగి 28.4 శాతానికి చేరుకుంది. ఈ రేటును తగ్గించేందుకు కంపెనీ ఈ ప్రకటనలు చేసింది.

English summary

Infosys Hirings: ఇన్ఫోసిస్ భారీ రిక్రూట్‌మెంట్స్.. TCS, Wipro, HCLలను వెనక్కి నెట్టి.. జీతాల పెంపు.. | infosys hired more employees than competetots TCS, Wipro, HCL with wage hikes to control employees turnover

infosys hired more employees than competetots TCS, Wipro, HCL with wage hikes to control employees turnover
Story first published: Monday, July 25, 2022, 18:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X