For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షేర్ హోల్డర్లకు రూ.24,100 కోట్లు ఇచ్చిన ఇన్ఫోసిస్

|

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.24,100 కోట్ల క్యాపిటల్ రిటర్న్స్‌ను ఇచ్చింది. వాటాదారులకు ఈ మొత్తాన్ని చెల్లించింది. ఒక్కో షేరుకు రూ.31 డివిడెండ్ (తుది డివిడెండ్ రూ.16, మధ్యంతర డివిడెండ్ రూ.15) చెల్లింపుతో పాటు రూ.11,000 కోట్ల మేర షేర్లను బైబ్యాక్ చేసినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. కంపెనీ 41వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా మాట్లాడారు.

2021-22 అసాధారణ వృద్ధి 19.7 శాతం నమోదైన కారణంగా 16.3 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని, ఇది పదకొండేళ్లలో ఇన్ఫోసిస్‌కు వేగవంతమైన వృద్ధి అన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.13,000 కోట్ల మేర డివిడెండ్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో రూ.11,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేసింది. తద్వారా రూ.24,100 కోట్ల మూలధనాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపారు.

Infosys gave capital return of over Rs 24,100 crore in FY22

తమ క్లయింట్స్‌కు ఇన్ఫోసిస్ నమ్మకమైనదని, వారిని ముందుకు తీసుకు వెళ్లడానికి మా నైపుణ్యాన్ని వినియోగించే సామర్థ్యం ఉందని నందన్ నీలేకని అన్నారు. FY22లో గత పదకొండు సంవత్సరాల కాలంలో వేగవంతమైన వృద్ధిని సాధించిందన్నారు.

English summary

షేర్ హోల్డర్లకు రూ.24,100 కోట్లు ఇచ్చిన ఇన్ఫోసిస్ | Infosys gave capital return of over Rs 24,100 crore in FY22

Infosys gave a capital return of over Rs 24,100 crore in 2021-22 and it made a share buyback of more than Rs 11,000 crore, said Nandan Nilekani, chairman of the IT services company, on Saturday.
Story first published: Sunday, June 26, 2022, 12:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X