దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒక్కటి. ఈ కంపెనీనిని 1981లో ముంబైలో 10 వేల రూపాయల పెట్టుబడితో ఓ అపార్ట్ మెంట్ లో ఏడుగురు యువ ఇంజనీర్లు ప్రారంభించారు. ప్రస్తుతం కంపెనీ దాదాపు $80 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో పాటు $16 బిలియన్ల కంటే ఎక్కువ ఆదాయం నమోదు చేసింది. ఈ కంపెనీలో 3.35 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

1981
ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణానికి సంబంధించి ఇన్ఫోసిస్ దిగ్గజ వ్యవస్థాపకుడు NR నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి పలు విషయాలను గుర్తు చేసుకున్నారు. 1981 నాటి ఆ గజిబిజి చిత్రాన్ని 2022లో ఈ అందమైన చిత్రంగా మార్చడంలో ఇంత ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రతి ఇన్ఫోసియన్స్, ఎక్స్-ఇన్ఫోసియన్‌లకు ధన్యవాదలు తెలుపుతున్నట్లు నారాయణ మూర్తి తెలిపారు.

ముంబై
ముంబైలోని నా వన్-బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో మొదటి రోజు నుంచి మేము ఏడుగురం కూర్చున్నామని చెప్పారు. మూడు గంటల సుదీర్ఘ చర్చ తర్వాత మేము ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చామని వివరించారు. అలా ఇన్ఫోసిస్ కంపెనీ పురుడు పోసుకుందని నారాయణ మూర్తి వివరించారు. అప్పుడు తాను ఇచ్చిన రూ. 10,000 తర్వాత బిలియన్ డాలర్లు అవుతుందని కలలో కూడా ఊహించలేదు సుధా మూర్తి అన్నారు.

మెగా ఈవెంట్
ఇన్ఫోసిస్ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం, బుధవారం నాడు మెగా ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో తన కీలకమైన టెక్నాలజీలను ప్రదర్శనకు ఉంచింది ఇన్ఫోసిస్. ఇందులో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్వీస్‌లను అందించే క్లౌడ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ 'కోబాల్ట్', సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్లాట్‌పామ్ 'సైబర్ నెక్స్ట్', డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ 'టెన్నిస్', ఎంటర్‌ప్రైజ్‌ల కోసం తీసుకొచ్చిన డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'లీప్' ఉన్నాయి.

ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్
1981లో ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ లో పని చేస్తున్న ఎన్.ఆర్. నారాయణ మూర్తి, నందన్ నీలేకని, ఎన్.ఎస్.రాఘవన్, ఎస్.గోపాలకృష్ణన్. ఎస్.డి.శిబూలాల్, కె.దినేశ్, అశోక్ అరోరా బయటకు వచ్చారు. వీరంతా రూ.10 వేల పెట్టుబడితో ఇన్ఫోసిస్ కన్సల్టంట్స్ అనే స్టార్టప్ ను ప్రారంభించారు. 1987లో అమెరికాలో అంతర్జాతీయ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇన్ఫోసిస్ 2021 జులైలో 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించిన రెండో ఐటీ కంపెనీగా మారింది.

నారాయణ, సుధా ప్రేమ
నారాయణ మూర్తి.. ఈసీఐఎల్ కోసం బేసిక్ ఇంటర్‌ప్రిటర్‌ను తయారు చేశారు. ఆ సమయంలోనే సుధా మూర్తితో ప్రేమలో పడ్డారు ఉద్యోగం చేస్తేనే తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని సుధామూర్తి తండ్రి షరతు విధించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పుణేలోని ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో జనరల్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications