For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 నెలల కనిష్ఠానికి పారిశ్రామిక ఉత్పత్తి.. దెబ్బేసిన తయారీ రంగం పెర్ఫార్మెన్స్

|

దేశంలో తయారీ రంగం, పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన డేటాను కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసింది. దాని ప్రకారం, ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మార్చిలో 1.1 శాతం వృద్ధి సాధించింది. గత 5 నెలల్లో ఇదే అతి తక్కువ కావడం గమనార్హం. ఫిబ్రవరిలో వృద్ధి 5.6 శాతం నుంచి 5.8కి సవరించారు.

ప్రముఖ వార్తా సంస్థ జరిపిన సర్వేలో పలువురు ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మార్చిలో IIP వృద్ధి 3.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు. అయితే వాటిని తలక్రిందులు చేస్తూ కేవలం 1.1 శాతం వద్ద స్థిరపడింది. 2021-22లో 11.4 శాతంగా ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి.. 2022-23 ఏడాది మొత్తానికి 5.1 శాతం వృద్ధి సాధించింది.

Industrial production growth slides 5 months low 1.1 Percent

తయారీ మరియు విద్యుత్ విభాగాల స్తబ్దత కారణంగా మార్చిలో పారిశ్రామిక వృద్ధి గణనీయంగా పడిపోయింది. మాన్యుఫ్యాక్చరింగ్ రంగం ప్రభావం IIPలో మూడు వంతుల కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. ఫిబ్రవరిలో 5.6 శాతం పెరుగుదల నమోదుకాగా, ఏడాది ప్రాతిపదికన కేవలం 0.5 శాతం మాత్రమే వృద్ధి కనబరిచింది. అయితే ఫిబ్రవరిలో విద్యుత్ ఉత్పత్తి పెరుగుదల 8.2 శాతంతో పోలిస్తే 1.6 శాతం తగ్గింది.

సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఫిబ్రవరి నుంచి తయారీ ఉత్పత్తి 6.4 శాతం పెరగ్గా, విద్యుత్ ఉత్పత్తి 8.0 శాతం వృద్ధి చెందింది. ఇక మూడవ రంగం మైనింగ్ విషయానికి వస్తే దాని ఉత్పత్తి సంవత్సరానికి 6.8 శాతం మరియు నెలవారీ ప్రాతిపదికన 19.3 శాతం పెరిగింది. ప్రాథమిక వస్తువుల ఉత్పత్తిలో వృద్ధి ఫిబ్రవరిలో 6.9 నుంచి 3.3 శాతం సగానికి పైగా తగ్గింది. మార్చిలో క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి గౌరవప్రదంగా 8.1 శాతం ఎగబాకింది.

English summary

5 నెలల కనిష్ఠానికి పారిశ్రామిక ఉత్పత్తి.. దెబ్బేసిన తయారీ రంగం పెర్ఫార్మెన్స్ | Industrial production growth slides 5 months low 1.1 Percent

Industrial production growth slides 5 months low 1.1Percent.
Story first published: Saturday, May 13, 2023, 8:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X