For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IndiGo: నష్టాలు పెరిగాయ్: రూ.వందల కోట్లల్లో: దెబ్బకొట్టిన ఇంధన రేట్లు

|

ముంబై: దేశీయ పౌర విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో)కు నష్టాలు వెంటాడుతున్నాయి. వందల కోట్ల రూపాయల మేర నష్టాలను మళ్లీ చవి చూసింది సంస్థ. సంస్థ నష్టాలు మరింత పెరుగుతున్నాయే తప్ప ఎక్కడే గానీ తగ్గట్లేదు. ఈ పరిణామాలు సంస్థ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు. నష్టాలను తగ్గించుకోవడానికి ఇండిగో సంస్థ యాజమాన్యం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

మరో ప్రభుత్వరంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్మరో ప్రభుత్వరంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఇండిగో క్యూ 4 ఫలితాలివీ..

ఇండిగో క్యూ 4 ఫలితాలివీ..

కొద్దిసేపటి కిందటే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్.. తన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. వాటిని రెగ్యులేటర్‌కు సమర్పించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 1,682 కోట్ల రూపాయల నికర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అంటే 2021-2022లో 1,147 కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొంది. ఇప్పుడీ సంఖ్య భారీగా పెరిగింది. 1,682 కోట్ల రూపాయలకు చేరింది.

అధిక ఇంధన ధరలు..

అధిక ఇంధన ధరలు..

అధిక ఇంధన ధరల వల్లే పౌర విమానయాన రంగం భారీగా నష్టాలను చవి చూడాల్సి వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో జెట్ ఫ్యూయెల ధరలను భారీగా పెంచుతూ వస్తోన్న విషయం తెలిసిందే. కిలో లీటర్ మీద వేల రూపాయలను అదనంగా చెల్లించాల్సిన పరిస్థితిని సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా నష్టాలు వస్తున్నాయనే వాదనలు లేకపోలేదు.

పెరిగిన ఆపరేషన్స్ రెవెన్యూ..

పెరిగిన ఆపరేషన్స్ రెవెన్యూ..

కాగా- ఇండిగో ఆపరేషన్స్ రెవెన్యూ భారీగా పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్ తరహా పరిస్థితుల నుంచి సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ రికవరీ కాగలిగిందనడానికి పెరిగిన ఆపరేషన్స్ రెవెన్యూ నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మొత్తంగా దీని రెవెన్యూ 29 శాతం మేర పెరిగింది. 8,021 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఇండిగో యాజమాన్యం రికార్డు చేసిన ఆపరేషన్స్ రెవెన్యూ 6,223 కోట్ల రూపాయలు.

రూపాయి విలువ క్షీణించడం..

రూపాయి విలువ క్షీణించడం..

అధిక ఇంధన ధరలు, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తుండటం వల్ల నష్టాలను చవి చూడాల్సి వచ్చిందని ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రొనొజొయ్ దత్త తెలిపారు. సంస్థ ఇంధన వ్యయం 68.2 శాతం పెరిగిందని, అదనంగా 3,221 కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో 76.7 శాతంగా నమోదైందని, ఇందులో 19.2 శాతంతో 4.40 కోట్ల రూపాయల మేర పెరిగిందని అన్నారు.

English summary

IndiGo: నష్టాలు పెరిగాయ్: రూ.వందల కోట్లల్లో: దెబ్బకొట్టిన ఇంధన రేట్లు | IndiGo Q4 results: widening of consolidated net loss at Rs 1681 Crore

Domestic budget carrier Interglobe Aviation Limited (IndiGo) posted a widening of consolidated net loss at Rs 1,681 crore.
Story first published: Wednesday, May 25, 2022, 17:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X