For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: భారీగా దెబ్బతీసిన మెటల్, రియాల్టీ

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం ఓ సమయంలో తిరిగి లాభాల్లోకి వచ్చినట్లు కనిపించినా ఆ తర్వాత తిరిగి నష్టపోయాయి. మొత్తానికి ఊగిసలాటలో ఉన్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో నేటి ట్రేడింగ్‌ను కాస్త సానుకూలంగా ఆరంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.

నష్టాల్లో మార్కెట్లు

నష్టాల్లో మార్కెట్లు

సెన్సెక్స్ నేడు ఉదయం 48,898.93 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,898.93 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,473.43 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం సమయానికి 471.01 (0.96%) పాయింట్లు నష్టపోయి 48,690.80 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 60.35 (0.41%) పాయింట్లు క్షీణించి 14,669.65 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,749.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,749.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,591.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి మధ్యాహ్నం వరకు టాప్ గెయినర్స్ జాబితాలో UPL 8.74 శాతం, ఏషియన్ పేయింట్స్ 8.45 శాతం, ఐటీసీ 4.43 శాతం, నెస్ట్లే 2.17 శాతం, లార్సన్ 2.12 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా 4.27 శాతం, హిండాల్కో 3.79 శాతం, గ్రాసీమ్ 3.70 శాతం, టాటా స్టీల్ 3.40 శాతం, టాటా మోటార్స్ 3.31 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో UPL, టాటా స్టీల్, ఏషియన్ పేయింట్స్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 స్టాక్స్ 0.19 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.31 నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకు 0.99 శాతం, నిఫ్టడీ బ్యాంకు 0.68 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.46 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.54 శాతం, నిఫ్టీ ఐటీ 1.08 శాతం, నిఫ్టీ మీడియా 1.16 శాతం, నిఫ్టీ మెటల్ 3.08 శాతం, నిఫ్టీ ఫార్మా 1.07 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.22 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.85 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.69 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.99 శాతం లాభపడింది.

English summary

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: భారీగా దెబ్బతీసిన మెటల్, రియాల్టీ | Indices trade flat amid volatility: metals, realty stocks drag

Except FMCG, all other sectoral indices were trading in the red with Nifty Metal index declining over 3 percent.
Story first published: Friday, May 14, 2021, 14:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X