For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crude Oil: రష్యా చమురు 50 రెట్లు పెంచిన భారత్.. భారీ డిస్కౌంట్లతో కంపెనీలు హ్యాపీ.. పాత మిత్రుడికి..

|

Russian Crude Oil: ఇరాక్, సౌదీ అరేబియాలను వెనక్కి నెట్టి రష్యా త్వరలో భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించనుంది. ఇది కేవలం వ్యాపార ప్రాధాన్యతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు.. ఇండియా-రష్యా మధ్య స్నేహీన్ని కూడా ప్రతిబింబిస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికాతో సహా అనేక యూరోపియన్ దేశాలు రష్యాపై పెద్ద ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు ప్రపంచ చెల్లింపు వ్యవస్థ నుంచి ప్రధాన రష్యన్ బ్యాంకుల నిష్క్రమణకు దారితీశాయి.

ఈ కారణంగా రష్యా తన పెట్రోలియం ఉత్పత్తులను ప్రపంచానికి విక్రయించలేకపోయింది. అటువంటి పరిస్థితిలో.. భారత్ తన పాత స్నేహితుడి సంక్షోభంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. అమెరికా హెచ్చరికలను దాటుకుని చమురు కొనుగోళ్లను చేస్తోంది. దీని వల్ల ప్రస్తుతం రష్యా మన దేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించబోతోంది.

30 డాలర్ల డిస్కౌంట్

30 డాలర్ల డిస్కౌంట్

రష్యా అనేక సాంప్రదాయ యూరోపియన్ కొనుగోలుదారుల మాదిరిగా కాకుండా.. ఈ నెలలో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్ కు రోజుకు 1- 1.2 మిలియన్ బ్యారెళ్ల చమురును సరఫరా చేసింది. ఇది దాదాపు ఇరాక్, సౌదీ అరేబియా నుంచి భారత్‌కు వస్తున్న ముడి చమురుతో సమానం. రష్యా భారతదేశానికి బ్యారెల్‌కు 30 డాలర్ల తక్కువకే అందిస్తోంది. దీంతో భారత రిఫైనరీలు రష్యాకు చెందిన ముడి చమురును పెద్ద మొత్తంలో చౌకగా కొనుగోలు చేస్తున్నాయి. కంపెనీలు రష్యా అందించే రేట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఇరాక్- సౌదీల నుంచి తగ్గించి

ఇరాక్- సౌదీల నుంచి తగ్గించి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు దిగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి . ఫిబ్రవరి వరకు భారత్‌కు దిగుమతి అయ్యే ముడి చమురులో రష్యా వాటా స్వల్పంగానే ఉంది. అప్పటి నుంచి రష్యన్ చమురు వాటా 50 రెట్లు పెరిగింది. భారతీయ రిఫైనరీలు తమ నిల్వలను చౌక ధరలకు వస్తున్న చమురుతో నింపుకుంటున్నాయి.

జూన్ నెలలో రష్యా నుంచి భారత్ రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ కాలంలో ఇరాక్ నుంచి రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు, సౌదీ అరేబియా నుంచి 6.62 లక్షల బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి అవుతోంది.

భారత్ చైనాలకు ఎక్కువగా..

భారత్ చైనాలకు ఎక్కువగా..

కొన్ని యూరోపియన్ కంపెనీలు రష్యా చమురు కొనుగోలును నిలిపివేయడంతో ఆసియాలోకి రష్యా ముడిచమురు వస్తోంది. ఇది రష్యా ప్రత్యామ్నాయ మార్కెట్‌ను కనుగొనవలసి వచ్చింది. అటువంటి పరిస్థితిలో.. రష్యాకు భారత్ అతిపెద్ద మార్కెట్ అక్కరకు వచ్చింది. తన జాతీయ ప్రయోజనాల కోసం చౌకగా అందుతున్న చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు మన దేశం ఇప్పటికే తెలిపింది.

ఈ డబ్బును రష్యా యుద్ధ అవసరాలకు వినియోగిస్తోంది. కేవలం భారత్ ఒక్కటే కాకుండా చైనాకు సైతం రష్యా భారీ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ఎగుమతులు చేస్తోంది. ఏదేమైనా భారత్ కు రష్యా తక్కువ రేటుకే చమురు విక్రయాలు చేస్తోంది. మరో పక్క రష్యా నుంచి బంగారాన్ని కూడా అనేక దేశాలు దిగుమతి నిలిపివేశాయి. ఇది భారత్ కు ఎలా కలిసి వస్తుందో వేచి చూడాలి.

Read more about: crude oil russian crude oil
English summary

Crude Oil: రష్యా చమురు 50 రెట్లు పెంచిన భారత్.. భారీ డిస్కౌంట్లతో కంపెనీలు హ్యాపీ.. పాత మిత్రుడికి.. | indias crude oil imports increased 50 times from russia amid reduced imports from iraq and saudi arabi for discounted crude oil

indias crude oil imports increased drastically at discount from russia know details
Story first published: Thursday, June 30, 2022, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X