For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్, డీజిల్ హోమ్ డెలివరీ: త్వరలో తెలుగు రాష్ట్రాల్లోనూ...

|

పెట్రోల్, డీజిల్ కావాలా? బంకుకు వెళ్లాలన్నా మీ వాహనంలో ఇంధనం లేదా? అయితే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు! ఎందుకంటే త్వరలో పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే మొబైల్ బంకులు మన తెలుగు రాష్ట్రాల పరిధిలోను అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలో తొలిసారి సూర్యాపేట జిల్లా నడిగూడెం కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ పెట్రోల్ బంకు నిర్వహణకు అనుమతి లభించింది. పెట్రోల్, డీజిల్ పంపులు బిగించిన ప్రత్యేక వాహనాన్నికొనుగోలు చేసి హోమ్ డెలివరీకి సిద్ధమవతున్నారు.

<strong>మెచ్యూరిటీకి ముందే పీఎఫ్ ఉపసంహరించుకుంటే ట్యాక్స్ పడుతుంది</strong>మెచ్యూరిటీకి ముందే పీఎఫ్ ఉపసంహరించుకుంటే ట్యాక్స్ పడుతుంది

పెట్రోల్, డీజిల్ హోమ్ డెలివరీ...

పెట్రోల్, డీజిల్ హోమ్ డెలివరీ...

గ్రామాల్లోని వారి వాహనాల్లో పెట్రోల్, డీజిల్ అయిపోతే అక్కడే ఉండి దుకాణాల్లో అమ్మే వారి నుంచి కొనుగోలు చేయాలి లేదా సమీపంలోని మండల లేదా తాలుకా కేంద్రాల్లోకి ఇంధనం కొనుగోలు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. చాలామంది గ్రామస్తులు దూరం వెళ్లవలసి వస్తుంది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ హోమ్ డెలివరీ చేసే ట్యాంకర్లు రానుండటం గమనార్హం.

పెట్రోల్, డిజిల్ అందిస్తారు..

పెట్రోల్, డిజిల్ అందిస్తారు..

హోమ్ డెలివరీ కోసం వినియోగించే వాహనాల్లో ఓ వైపు పెట్రోల్, మరోవైపు డీజిల్ పంపులు ఏర్పాటు చేశారు. గ్రామాలకు వెళ్లి రైతులు, ఇతర వాహనదారులకు పెట్రోల్, డీజిల్ అందిస్తారు. నడిగూడెం కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో.. ఐవోసీ బంకుకు అనుబంధంగా మొబైల్ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే పలు నగరాల్లో బల్క్...

ఇప్పటికే పలు నగరాల్లో బల్క్...

గ్రాసరీస్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) కూడా ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో డీజిల్ హోమ్ డెలివరీని ప్రారంభించింది. ముంబై, పుణే వంటి వివిధ ప్రాంతాల్లో డీజిల్‌ను డెలివరీ చేస్తున్నారు. IOC, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL)లు ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ డిసెంబర్ నాటికి 20 ప్రధాన నగరాల్లో డోర్ డెలివరీ చేయాలని ఇదివరకే నిర్ణయించుకున్నాయి. ఏడాది ఆఖరి నాటికి 500 ప్రత్యేక డోర్ స్టెప్ ఫ్యూయల్ వెహికిల్స్‌ను అందుబాటులోకి తేనున్నట్లు గతంలోనే ప్రకటించాయి. అయితే ఇవి నగరాల్లో పెద్ద కంపెనీలు, బల్క్ కస్టమర్లకు డోర్ డెలివరీ చేస్తున్నాయి.

డీజిల్‌తో ప్రారంభం...

డీజిల్‌తో ప్రారంభం...

తొలుత డీజిల్‌ను మాత్రమే డోర్ డెలివరీ ద్వారా అందించాయి ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు. బల్క్‌గా పెట్రోల్‌కు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. ప్రస్తుతం 35కు పైగా నగరాల్లో డీజిల్ డోర్ డెలివరీ సౌకర్యం ఉంది. ఐవోసీ 15, బీపీసీఎల్ 13, హెచ్‌పీసీఎల్ 7 నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. మరో 500 డోర్ డెలివరీ వాహనాలను కొనుగోలు చేయాలని ఇదివరకే నిర్ణయించాయి. బల్క్‌గా కొనే కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈ సేవలను ప్రారంభించారు. ఒకేసారి 2000 లీటర్లకు మించి ఇంధనం కొనాలంటే పెసో అనుమతి అవసరం.

English summary

పెట్రోల్, డీజిల్ హోమ్ డెలివరీ: త్వరలో తెలుగు రాష్ట్రాల్లోనూ... | Indian Oil Corporation starts home delivery service

The state-run oil marketing companies (OMCs) — Indian Oil Corporation (IOC), Bharat Petroleum Corporation (BPCL) and Hindustan Petroleum Corporation (HPCL) — are planning to expand doorstep delivery of diesel to 20 more cities, and introduce home delivery of petrol by the next quarter.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X