For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ రూటు మార్చాయి: అక్కడి నుండి భారీ డీల్స్, కొనుగోళ్లు

|

భారత ఐటీ కంపెనీలు యూరోప్ వైపు దృష్టి సారించాయి. ఈ ప్రాంతం నుండి అధిక డీల్స్‌తో పాటు కంపెనీల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నాయి. దేశీయ టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు గత కొద్దికాలంగా యూరోపియన్ మార్కెట్లపై దృష్టి పెట్టాయి. ఇటీవల యూరోపియన్ ప్రాంతం నుండి భారీ డీల్స్ రావడంతో దేశీయ ఐటీ కంపెనీలు రూటు మార్చినట్లు చెబుతున్నారు.

ఇప్పటి వరకు మన ఐటీ కంపెనీలకు ఎక్కువగా రాబడి అమెరికా నుండి ఉంది. ఆదాయంలో అగ్రరాజ్యం వాటా 70 శాతం వరకు ఉంటుంది. అయితే ఇటీవల కంపెనీలు యూరోపియన్ సంస్థలను కొనుగోలు చేస్తున్నాయి. మరిన్ని కొనుగోళ్లు, పెద్ద డీల్స్ రానున్నాయని ఐటీ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు జంప్: కోలుకుంటున్న రియల్ ఎస్టేట్హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు జంప్: కోలుకుంటున్న రియల్ ఎస్టేట్

జర్మన్ మార్కెట్..

జర్మన్ మార్కెట్..

యూరోప్ నుండి చూసుకుంటే ఇటీవల జర్మనీ నుండి మెగా డీల్స్ వచ్చాయని, జర్మన్ కంపెనీలు గతంలో ఔట్ సోర్సింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయని హెచ్‌ఎఫ్ఎస్ రీసెర్చ్ సీఈవో అన్నారు. జర్మన్ కంపెనీలు వ్యూహం మార్చి ఔట్ సోర్సింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు అవకాశాలు పెరిగినట్లు చెబుతున్నారు. లాభదాయక జర్మన్ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేలా ముందుకు సాగుతున్నాయి.

పట్టు కోసం టీసీఎస్

పట్టు కోసం టీసీఎస్

టీసీఎస్ యూరోప్ మార్కెట్‌లో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తోందని, ఈ ప్రాంతంలో మరిన్ని అక్వైజేషన్స్ ఉండవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాంత నుండి ప్రతి ఏడాది 20 శాతం కంటే ఎక్కువ వృద్ధి కనిపిస్తోందని చెబుతున్నారు. నవంబర్ నెలలో టీసీఎస్ ఇక్కడి పోస్ట్ బ్యాంక్ సిస్టం ఏజీ నుండి దక్కించుకుంది. జర్మనీకి చెందిన ఈ కంపెనీలో 1500 మంది ఉద్యోగులు ఉన్నారు. అదే నెలలో ఐటీ అసెట్స్ ఆఫ్ ప్రమెరికా సిస్టంను అక్వైర్ చేసుకుంది.

విన్నింగ్ స్ట్రాటెజీ

విన్నింగ్ స్ట్రాటెజీ

టీసీఎస్‌తో పాటు ఇతర టెక్నాలజీ సంస్థలకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం వంటి అంశాలు విన్నింగ్ స్ట్రాటెజీగా ఉన్నాయని చెబుతున్నారు. ఇతర కంపెనీల కొనుగోళ్ల నేపథ్యంలో టీసీఎస్ 2022 ఆదాయ అంచనాల్లో భారీగా వృద్ధి ఆశిస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.

English summary

టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ రూటు మార్చాయి: అక్కడి నుండి భారీ డీల్స్, కొనుగోళ్లు | Indian IT Firms rush in as Europe takes to outsourcing in new normal

Indian IT services providers will step up focus on Europe this year to tap a market that has traditionally shied away from outsourcing, experts said.
Story first published: Thursday, January 7, 2021, 18:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X