For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందగమనంలోనూ మెరుపులు... ఇండియా లో 100 కొత్త మాల్స్!

|

ఒకవైపు ఆర్థిక మందగమనంతో దేశం సతమతం అవుతుంటే... ఒకే ఒక్క రంగం దూసుకుపోతోంది. అది ఎంటర్టైన్మెంట్ అండ్ రిటైల్. తెలిసీ తెలియక కొందరు మంత్రులు సినిమా కలెక్షన్స్ చూసి అదే దేశం అభివృద్ధి అనుకుంటారు. అసలు విషయమేమిటంటే... ఎంటర్టైన్మెంట్ అనేది రిసెషన్ ప్రూఫ్ సెక్టార్. అంటే మందగమనంతో సంబంధం లేకుండా ఎప్పుడూ కళకళలాడుతుంది. అది మందగమనం సమయంలో మరింత అధికం అవుతుంది. ఎందుకంటే, జనాలు డిప్రెషన్ లాంటి పరిస్థితిలో ఉంటే వారికి కొంత ఊరట నిచ్చేది ఎంటర్టైన్మెంట్. అంటే సినిమాలు. ఆ కొద్దీ సేపైనా అన్ని బాధలూ పక్కన పెట్టి సినిమా చూస్తూ ఆస్వాదిస్తారు.

సంక్రాంతికి విడుదలైన రెండు భారీ చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం రెండూ దాదాపు రూ 200 కోట్ల వసూళ్లు రాబట్టాయని వార్తల్లో పేర్కొనటం దీనికి ఒక నిదర్శనమే. ఎటూ జనాలు అప్గ్రేడ్ అవుతున్నారు. విదేశాల్లో ఉన్న వసతులు, సౌకర్యాలు, టెక్నాలజీ ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టే మన వారు కూడా సినిమా హాళ్లను కేవలం సినిమాల కోసమే కాకుండా... పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లా కట్టేస్తున్నారు. వాటినే మాల్స్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. మహా నగరాల్లో ఇప్పటికే బాగా పెరిగిన మాల్ సంస్కృతి ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలూ, పట్టణాలకూ విస్తరిస్తోంది. ఇందుకు నిదర్శనమే దేశంలో పెరుగుతున్న మాల్స్ సంఖ్య.

<strong>ఈపీఎఫ్ లో ఇకపై మీరే మీ ఎగ్జిట్ డేట్ ను అప్డేట్ చేయొచ్చు!</strong>ఈపీఎఫ్ లో ఇకపై మీరే మీ ఎగ్జిట్ డేట్ ను అప్డేట్ చేయొచ్చు!

100 పైలుచుకు మాల్స్..

100 పైలుచుకు మాల్స్..

రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సేవలు అందించే అనారోక్ ... ఈ అంశంపై ఒక్క నివేదిక రూపొందించింది. అందులో దేశంలో మరో రెండేళ్లలోనే (2022 నాటికి) సుమారు 100 కొత్త మాల్స్ అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపింది. కళ్ళు చెదిరేలా అభివృద్ధి చేస్తున్న ఈ మాల్స్ ద్వారా కొత్తగా 4.9 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్పేస్ అందుబాటులోకి రానుంది. మొత్తం మాల్స్ లో దేశంలోని 7 మహా నగరాల్లోనే కొత్తగా 69 మాల్స్ రాబోతున్నాయి. వీటి మొత్తం విస్తీర్ణం సుమారు 3.55 కోట్ల చదరపు అడుగులు కావటం విశేషం. అదే సమయంలో ద్వితీయ శ్రేణి నగరాలైన అహ్మదాబాదు, లక్నో, ఇండోర్, సూరత్, నాగపూర్ లో మరో 31 మాల్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటిని 1.35 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. దేశంలో పశ్చిమ, దక్షిణ రాష్ట్రాల్లోనే ఎక్కువ సంఖ్యలో మాల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.

హైదరాబాద్ లో 12 మాల్స్...

హైదరాబాద్ లో 12 మాల్స్...

ఇటీవల అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతున్న మన హైదరాబాద్.... ఇప్పుడు కొత్త మాల్స్ విషయంలోనూ ముందు వరుసలో ఉంది. ఒక్క మన భాగ్యనగరం లోనే కొత్తగా 12 భారీ మాల్స్ అందుబాటులోకి రాబోతున్నాయని అనారోక్ వెల్లడించింది. వీటి సంయుక్త అభివృద్ధి ప్రాంతం సుమారు 40 లక్షల చదరపు అడుగులు ఉండబోతోందని తెలిపింది. ఇదిలా ఉండగా... కొత్త మాల్స్ రావటంలో ముంబై (18), ఢిల్లీ (13) తర్వాత మన హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. దక్షిణాదిలో ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరు లో కొత్తగా 10 మాల్స్ రాబోతుండగా... తమిళ నాడు రాజధాని చెన్నై లో 9 కొత్త మాల్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. పూణే లో 4 మాల్స్, కోల్కతా లో 3 మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. టయర్ టూ సిటీస్ లో 6 కొత్త మాల్స్ తో అహ్మదాబాద్ ముందు ఉంది.

2.90 బిలియన్ డాలర్ల పెట్టుబడులు...

2.90 బిలియన్ డాలర్ల పెట్టుబడులు...

దేశంలో వినియోగ డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ... కుటుంబంతో ఎంటర్టైన్మెంట్, సినిమాలు, బ్యూటీ, వెల్నెస్ వంటి రంగాలు మెరుగ్గా రాణిస్తాయని అనారోక్ అంచనా వేసింది. అలాగే, దేశంలో గత ఐదేళ్ళలో ఎన్నడూ లేనంత అధికంగా రిటైల్ స్పేస్ అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ఇందుకోసం విదేశీ పెట్టుబడిదారులు భారీగా ఇన్వెస్ట్ చేశారని పేర్కొంది. 2015 నుంచి 2019 నాటికీ దేశంలో మాల్స్ తరహా రిటైల్ ప్రాజెక్టుల్లోకి ఏకంగా 2.9 బిలియన్ డాలర్ల (రూ 20,300 కోట్లు) పెట్టుబడులు వచ్చాయని అనారోక్ వెల్లడించింది. ఇందులో హైదరాబాద్ రిటైల్ రంగంలోకి కూడా రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావటం తెలిసిందే.

English summary

మందగమనంలోనూ మెరుపులు... ఇండియా లో 100 కొత్త మాల్స్! | Indian cities to add 100 new malls by 2022 end, says Anarock MD & CEO

Despite low consumer spending in recent times, mall developers remain bullish on the growth potential of organized retail. 100 new malls spanning over 49 mn sft are scheduled to come up across the country by 2022 end.
Story first published: Thursday, January 23, 2020, 7:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X