2020-21 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు) పసిడి దిగుమతులు భారీగా తగ్గాయి. ఈ కాలంలో 47 శాతం తగ్గి 9.28 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.69,000 కోట్లు) పరిమితమయ్యాయి. కరోనా మహమ్మారి, లాక్ డౌన్, ధరలు ఈ కాలంలో భారీగా పెరగడంతో పసిడి కొనుగోళ్లు తగ్గాయి. మార్చి చివరి వారంలో లాక్ డౌన్ ప్రారంభం కాగా, అంతకుముందు పసిడి ధరలు రూ.40వేల దిగువన పలికాయి. మూడు నెలల క్రితం రూ.58వేలకు చేరుకొని, ఇప్పుడు రూ.52వేల దిగువన ఉన్నాయి. అంటే ప్రస్తుతం రూ.12వేల వరకు పైన పలుకుతోంది. ధరలు భారీగా పెరగడంతో సెప్టెంబర్ వరకు కొనుగోళ్ళు పడిపోయాయి. ఆగస్ట్ 7వ తేదీ తర్వాత నుండి ధరలు దాదాపు స్థిరంగా ఉండటంతో పాటు దసరా, దీపావళి, ధనత్రయోదశి సమయంలో కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. అయితే కాయిన్స్ ఎక్కువగా కొనుగోలు చేశారు.

7 నెలల్లో దిగుమతులు డౌన్, అక్టోబర్‌లో జంప్
2019 ఏప్రిల్ - అక్టోబర్ కాలంలో పసిడి దిగుమతులు 17.64 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.31 లక్షల కోట్లు) కాగా, ఈసారి 47.42 శాతం క్షీణించి 9.28 డాలర్లకు పడిపోయాయి. ఏడు నెలల కాలంలో భారీగా తగ్గినప్పటికీ, అక్టోబర్ నెలలో మాత్రం దిగుమతులు 36 శాతం పెరగడం గమనార్హం. పండుగ సీజన్, ధరలకు ప్రజలు అలవాటు పడటం వంటి కారణాలతో సేల్స్ పుంజుకోవడం ఇందుకు కారణం. ఏప్రిల్-అక్టోబర్ కాలంలో వెండి దిగుమతులు 64.65 శాతం పడిపోయి 742 మిలియన్ డాలర్లుగా ఉంది.

తగ్గిన వాణిజ్య లోటు
2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల కాలంలో పసిడి, వెండి దిగుమతులు దాదాపు సగం మేర తగ్గడంతో వాణిజ్యలోటు 32.16 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వాణిజ్యలోటు 100.67 బిలియన్ డాలర్లుగా ఉంది. జ్యువెల్లరికీ మన దేశంలో డిమాండ్ ఎక్కువ. దీంతో బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఉంది. ప్రతి ఏటా దాదాపు 800 టన్నుల నుండి 900 టన్నుల మేర బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.

తగ్గిన ఆభరణాల ఎగుమతులు
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు కూడా భారీగానే క్షీణించాయి. ఏప్రిల్ - అక్టోబర్ కాలంలో ఈ దిగుమతులు దాదపు 49.5 శాతం తగ్గి 11.61 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బంగారం డిమాండ్ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కాస్త పుంజుకుంది. ప్రధానంగా దీపావళి, ధనత్రయోదశి సమయంలో ఎంతోకొంత బంగారం కొనుగోలు చేయాలని కోట్లాది మంది విశ్వసిస్తారు. దీంతో చిన్న మొత్తంలో కొనుగోళ్లు జరిపారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications