For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆగస్ట్‌లో 8.5% పడిపోయిన 8 రంగాల పారిశ్రామిక ఉత్పత్తి

|

దేశీయ మౌలికరంగం ఆగస్ట్ నెలలో వెనుకడుగు వేసింది. 8 కీలక రంగాల సూచీ ఆగస్ట్ నెలలో 8.5శాతం మేర క్షీణించింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డేటా ప్రకారం వరుసగా ఆరో నెల క్షీణత నమోదు చేసింది. ప్రధానంగా స్టీల్, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్ ప్రొడక్షన్ భారీగా పడిపోయింది. ఎనిమిది కోర్ పరిశ్రమల సూచీ 2019 ఆగస్ట్ నెలలో 0.2 శాతం క్షీణించింది. ఎనిమిది రంగాల్లో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ప్రోడక్ట్స్, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉన్నాయి.

అదిరిపోయే రిటర్న్స్: ఈ స్టాక్స్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.2 కోట్ల నుండి రూ.10 కోట్లు!అదిరిపోయే రిటర్న్స్: ఈ స్టాక్స్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.2 కోట్ల నుండి రూ.10 కోట్లు!

ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్(IIP) సూచీలో వీటి వాటా 40.27 శాతంగా ఉంటుంది. బొగ్గు, ఎరువులు మినహా మిగిలిన రంగాలు ఆగస్ట్ నెలలో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ఇక, ఏప్రిల్-ఆగస్ట్ కాలంలో ఎనిమిది కోర్ రంగాలు ఏడాది క్రితంతో పోలిస్తే 17.8 శాతం మేర క్షీణించాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో ఈ రంగాలు 2.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 8 కీలక రంగాల వృద్ధి సూచీని కేంద్రం మే నెలలో 21.4 శాతం ప్రతికూలత ఉంటుందని అంచనా వేసింది.

India’s eight core industries fall 8.5 percent in August

2019 ఆగస్ట్‌తో పోలిస్తే 2020 ఆగస్ట్ నెలలో పెట్రోలిటం రిఫైనరీ ఉత్పత్తులు 19.1 శాతం క్షీణించాయి. సిమెంట్ ఉత్పత్తి 14.6 శాతం మేర క్షీణించింది. ఏప్రిల్-ఆగస్ట్ కాలంలో నెచరల్ గ్యాస్ ఉత్పత్తి 9.5 శాతం, ఫెర్టిలైజర్ ఉత్పత్తి 7.3 శాతం, స్టీల్ ఉత్పత్తి 6.3 శాతం మేర క్షీణించింది. అదే సమయంలో బొగ్గు ఉత్పత్తి ఆగస్ట్ నెలలో 3.6 శాతం మేర క్షీణించింది. ఎలక్ట్రిసిటీ జనరేషన్ 2.7 శాతం పడిపోయింది.

English summary

ఆగస్ట్‌లో 8.5% పడిపోయిన 8 రంగాల పారిశ్రామిక ఉత్పత్తి | India’s eight core industries fall 8.5 percent in August

The output for India's eight core industries contracted for the sixth straight month, dropping 8.5 percent in August 2020, shows data released by the Commerce and Industry Ministry on September 30.
Story first published: Wednesday, September 30, 2020, 21:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X