For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూపర్ స్పీడ్‌తో భారత ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తులో వ్యాక్సీన్ వస్తే...

|

భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే వేగంగా వృద్ధిని నమోదు చేస్తోందని బార్క్‌లేస్ నివేదిక తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును గతంలో 7 శాతం అంచనా వేయగా, ఈసారి 8.5 శాతానికి సవరించింది. ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమైన నేపథ్యంలో వచ్చే ఏడాది వృద్ధి రేటు గతంలో కంటే పెరుగుతుందని తెలిపింది. ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా కలిగిన భారత్ ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయని పేర్కొంది. కరోనా గాయం నుండి భారత్ ఊహించిన దాని కంటే వేగంగా కోలుకుంటోందని గతంలో మూడీస్, గోల్డ్‌మన్ శాక్స్ కూడా తెలిపాయి. ఈ మేరకు వృద్ధి రేటు అంచనాలను సవరించాయి.

అమెరికా ఎకానమీకి భారత్ విద్యార్థులు ఇచ్చింది ఎంతంటే? మొదటి స్థానంలో చైనాఅమెరికా ఎకానమీకి భారత్ విద్యార్థులు ఇచ్చింది ఎంతంటే? మొదటి స్థానంలో చైనా

భవిష్యత్తులో వ్యాక్సీన్ వస్తే..

భవిష్యత్తులో వ్యాక్సీన్ వస్తే..

దాదాపు 90 లక్షల కేసులతో భారత్ ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. సెప్టెంబర్ మిడిల్ నుండి రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే రికవరీ వేగవంతమైందని, భవిష్యత్తులో కరోనా వ్యాక్సీన్ వచ్చాక మరింత పునరుద్ధరణ ఉంటుందన బార్క్‌లేస్ అభిప్రాయపడింది. హీరో మోటో కార్ప్ సహా వాహనాల సేల్స్, టైటాన్ వంటి కంపెనీలు రికార్డ్ సేల్స్ నమోదు చేశాయి. మార్చి నండి ప్రపంచంలోనే కఠినమైన లాక్ డౌన్ విధించాక, మే నుండి అన్-లాక్ నేపథ్యంలో కార్యకలాపాలు పెరిగాయని తెలిపింది.

వృద్ధి రేటు...

వృద్ధి రేటు...

అయినప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ రేటును మరింత ప్రతికూలతకు సవరించింది. వృద్ధి రేటును మైనస్ 6 శాతం నుండి మైనస్ 6.4 శాతానికి సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో వృద్ధి రేటు మైనస్ 8.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ మైనస్ 8.6 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కూడా అంచనా వేసింది. రాయిటర్స్ పోల్‌లో కూడా భారత వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 9.0 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని భావిస్తుంది.

రికవరీ సంకేతాలు

రికవరీ సంకేతాలు

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్యాకేజీ, చర్యలు భారత ఆర్థిక వ్యవస్థ వేగవంత రికవరీకి తోడ్పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పలు రేటింగ్ ఏజెన్సీలు భారత్ వేగంగా కోలుకుంటోందని చెబుతున్నాయి. ఇటీవల గోల్డ్‌మన్ శాక్స్ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందని వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 10.3 శాతం ప్రతికూలత, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధి నమోదు చేయవచ్చునని పేర్కొంది. అంతకుముందు మూడీస్ ఇన్వెస్టర్స్ కూడా భారత్‌లో వేగంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ, పూర్తి సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను సవరించింది.

English summary

సూపర్ స్పీడ్‌తో భారత ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తులో వ్యాక్సీన్ వస్తే... | India's economy to return to normal faster than expected

Barclays lifted its fiscal 2022 growth forecast for the Indian economy to 8.5% from an earlier projection of 7%, saying the country would "return to normal" faster than expected as the COVID-19 curve in the world's second-most populous nation starts flattening.
Story first published: Thursday, November 19, 2020, 17:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X