న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్ పైన ఏకంగా రూ.10, డీజిల్ పైన రూ.13 సుంకం పెంచింది. ఈ ధరలు ఈ రోజు (ఏప్రిల్ 6) నుండి అమలులోకి వచ్చాయి. అయితే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్రం తెలిపింది. పెట్రోల్, డీజిల్ పైన ప్రపంచంలోనే ఎక్కువ ట్యాక్స్ వసూలు చేసే దేశంగా ఇప్పుడు భారత్ నిలిచింది.

ట్యాక్స్ పెంపు ఇలా.. ప్రపంచంలోనే ఎక్కువ వసూలు
ప్రభుత్వం లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన రోడ్ సెస్‌ను రూ.8 పెంచింది. ఎక్సైజ్ డ్యూటీని ఒక్కో లీటర్ పెట్రోల్ పైన రూ.2 పెంచింది. లీటర్ డీజిల్ పైన రూ.5 పెంచింది. తాజా పెంపుతో ట్యాక్స్‌లు 69 శాతానికి పెరిగాయి. ఇప్పటి వరకు 60 శాతం లోపు భారత్‌లో ఉంది. కొన్ని దేశాలు 60 శాతాని కంటే ఎక్కువగా ఉన్నాయి. తాజా పెంపుతో వాటిని దాటి, ప్రపంచంలోనే ఎక్కువ ట్యాక్సులు వసూలు చేసిన దేశంగా నిలిచింది.

ఇంధన ధరలు పెరగలేదు..
కేంద్రం ఇంధన ధరలను పెంచలేదు. కేవలం ఎక్సైజ్ సుంకాన్ని మాత్రమే పెట్రోల్, డీజిల్ పైన వరుసగా రూ.10, రూ.13 పెంచాయి. మార్కెట్ మందగమనం నేపథ్యంలో ప్రస్తుత ఎక్సైజ్ డ్యూటీ పెంపు మార్కెట్ పైన ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన తర్వాత కూడా ఇక్కడ రిటైల్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

60 శాతానికి పైగా ఈ దేశాల్లో
పెట్రోల్, డీజిల్ పైన ఇండియాలో ట్యాక్స్ 69 శాతానికి పెరిగింది. 60 శాతం కంటే ఎక్కవగా ఫ్రాన్స్ (63 శాతం), జర్మనీ (63 శాతం), ఇటలీ (64 శాతం), బ్రిటన్ (62 శాతం) దేశాలలోను వసూలు చేస్తున్నారు. స్పెయిన్‌లో 53 శాతం, జపాన్‌లో 47 శాతం, కెనడాలో 33 శాతం, అమెరికాలో 19 శాతం ఉంది.

వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ పెంచిన ఢిల్లీ ప్రభుత్వం
మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం కూడా వాహనదారులకు షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు గత నెలన్నరగా నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో రిటైల్ ధరలను పెంచింది ప్రభుత్వం. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరపై రూ.1.67, లీటర్ డీజిల్‌పై రూ.7.10 పెరిగింది. ఢిల్లీ ప్రభుత్వం వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ పెంచడమే దీనికి కారణం. అసోంలోను గత నెలలో రాష్ట్రం పెంచింది. అన్ని రాష్ట్రాలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశాలు లేకపోలేదు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications