For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే జూన్ నుండి గూగుల్ కొత్త పాలసీ, ఇన్‌యాక్టివ్ ఖాతాల్లో డేటా డిలీట్!

|

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కన్స్యూమర్ అకౌంట్‌కు సంబంధించి కొత్త పాలసీని తీసుకు వస్తోంది. వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుండి ఇది అమల్లోకి రానుంది. మీ జీ-మెయిల్, డ్రైవ్ లేదా ఫోటోస్ గత రెండేళ్లుగా ఇన్-యాక్టివ్‌గా ఉంటే ఇందుకు సంబంధించిన కంటెంట్‌ను గూగుల్ తొలగించవచ్చు. కస్టమర్ల ఖాతాలో క్రియారహితంగా, పరిమితికి మించి ఉన్నవాటి కోసం టెక్ దిగ్గజం కొత్త పాలసీని తీసుకు వస్తోంది. ఈ కొత్త పాలసీతో డాక్స్, షీట్లు, సైడ్లు, డ్రాయింగ్స్, జూమ్ బోర్డు ఫైల్స్, ఫోటో పరిశ్రమలకు సేవలు ఇక నుండి సాధారణ పద్ధతులతో మరింత మెరుగ్గా ఉంటాయని గూగుల్ తెలిపింది.

LTC cash voucher scheme: కేంద్రం మరో గుడ్‌న్యూస్, కుటుంబ సభ్యులు కూడా...LTC cash voucher scheme: కేంద్రం మరో గుడ్‌న్యూస్, కుటుంబ సభ్యులు కూడా...

ఆ కంటెంట్ తొలగింపు

ఆ కంటెంట్ తొలగింపు

మీ స్టోరేజీ పరిధి రెండేళ్లు దాటినట్లయితే జీ-మెయిల్, డ్రైవ్, పోటోల్లోని కంటెంటును తొలగించనుంది. ఈ మేరకు కంపెనీ వెల్లడించింది. కంటెంటును తొలగించడానికి ముందు వినియోగదారుడికి పలుమార్లు సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపింది. ముందే అప్రమత్తం చేయడం వల్ల ఆ లోపు స్పందించేందుకు వెసులుబాటు ఉంటుంది. మీ ఖాతాను చురుగ్గా ఉండాలంటే ఎప్పటికి అప్పుడు జీ-మెయిల్, డ్రైవ్, ఫోటోస్‌ను చూస్తుండాలని తెలిపింది.

గూగుల్ రికార్డ్ చేసుకుంటుంది

గూగుల్ రికార్డ్ చేసుకుంటుంది

సైన్ ఇన్ చేస్తున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్ట్ చేశారని గూగుల్ రికార్డు చేసుకుంటుందని తెలిపింది. ఇన్-యాక్టివ్ అకౌంట్ మేనేజర్ నిర్దిష్ట కంటెంట్‌ను నిర్వహించడానికి, గూగుల్ ఖాతాను నిర్ణీత కాలపరిమితిలో ఉపయోగించడం మానేస్తే తెలియజేయడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. ఇన్-యాక్టివ్ అకౌంట్ మేనేజర్ సెట్టింగ్స్‌తో సంబంధం లేకుండా కొత్త రెండేళ్ల ఇన్-యాక్టివ్ పాలసీ వర్తిస్తుంది.

15GB స్టోరేజ్ దాటితే...

15GB స్టోరేజ్ దాటితే...

ఉచిత 15GB స్టోరేజ్ దాటితే గూగుల్ వన్‌తో మరింత స్టోరేజ్ ప్లాన్‌కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చునని తెలిపింది. 100GB స్పేస్ నుండి ప్రారంభమయ్యే ప్లాన్‌లను మీరు ఎంచుకోవచ్చును. వీటిలో గూగుల్ ఎక్స్‌పర్ట్స్, షేర్డ్ ఫ్యామిలీ ప్లాన్స్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయని తెలిపింది.

English summary

వచ్చే జూన్ నుండి గూగుల్ కొత్త పాలసీ, ఇన్‌యాక్టివ్ ఖాతాల్లో డేటా డిలీట్! | If you haven't used your Google account in 2 years, Content may get deleted for good

Google is introducing new policies for consumer accounts, effective from June 1 next year, and if you have been inactive in Gmail, Drive or Photos for two years, the company may delete the content in the product in which you are inactive.
Story first published: Monday, November 16, 2020, 16:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X