For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పు తీసుకోండి... షారుఖ్ ఖాన్ ను కలవండి... ఓ బ్యాంకు బంపర్ ఆఫర్

|

అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే రోజులకు కాలం చెల్లిపోతోంది. అప్పులిస్తామంటూ బ్యాంకులే కస్టమర్ల కోసం వెతుక్కుంటూ వచ్చే రోజులు వచ్చేశాయి. ఇటీవలే ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని బ్యాంకులు రుణ మేళాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇది అయిపోయినప్పటీకే బ్యాంకులు వేర్వేరుగా మేళాలను కొనసాగిస్తున్నాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. బ్యాంకుల వద్ద కుప్పల కొద్ది డబ్బులున్నాయి. రుణాలు తీసుకునే వారే కరువయ్యారు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అందుకే రుణ మేళాల ద్వారా కస్టమర్లను సంపాదించుకునే పనిలో పడ్డాయి.

మహా లోన్ క్యాంప్

మహా లోన్ క్యాంప్

ప్రయివేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు.. రుణ కస్టమర్ల సంఖ్యను భారీ స్థాయిలో పెంచుకుంటేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా 'మహా లోన్ ధమాకా' పేరుతో తక్షణమే రుణాలను అందించనుంది . ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2000 మహా లోన్ క్యాంపులను నిర్వహించాలని బ్యాంకు నిర్ణయించింది. వీటిని గ్రామీణ, సెమీ అర్బన్ ఏరియాలతో పాటు కంపెనీల ప్రాంగణాల్లోను క్యాంపులను నిర్వహించనుంది. విభిన్న రకాల రుణాలకు బ్యాంకు అక్కడికక్కడే అనుమతులు ఇవ్వనుంది. అంతే కాకుండా తక్షణమే రుణాలు ఇవ్వనుంది. ఈ మహా లోన్ లో భాగంగా బ్యాంకు ఒక క్విజ్ పోటీని కూడా పెడుతోంది. ఇందులో విజేతలుగా నిలిచే 100 మంది బ్యాంకు బ్రాండ్ ప్రచారకర్త షారుఖ్ ఖాన్ ను కలిసే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.

* ప్రతి క్యాంపు రెండు రోజులపాటు ఉండనుంది. తగిన డాక్యుమెంట్లతో వ్యక్తులు వస్తే ఆన్ ది స్పాట్ రుణానికి అప్రూవల్ ఇస్తామని బ్యాంక్ చెబుతోంది.

* టూ వీలర్లు, ఫోర్ వీలర్లు, ట్రక్కులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, వ్యక్తిగత రుణాలు, బంగారం రుణం, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి వాటికి సంభందించి ప్రత్యేక ఆఫర్లు, ప్యాకేజీలను బ్యాంకు అందిస్తోంది.

* సమీపంలోని పట్టణాలు, గ్రామాల ప్రజలకు బ్యాంకు ఉత్పత్తులు, సేవలు అందించడానికి ఈ మహా లోన్ క్యాంపులు వన్ స్టాప్ షాప్స్ మాదిరిగా పనిచేస్తుందని బ్యాంక్ అంటోంది.

కార్పొరేట్ల ప్రాంగణాల్లో

కార్పొరేట్ల ప్రాంగణాల్లో

మహా లోన్ క్యాంపులను భారీ కార్పొరేట్ కంపెనీల ప్రాంగణాల్లో కూడా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గృహ, వ్యక్తిగత, టూ వీలర్, ఫోర్ వీలర్ రుణాలతో పాటు క్రెడిట్ కార్డులకు తక్షణమే అనుమతులు ఇవ్వనున్నారు. మహా లోన్ క్యాంపుల్లో భాగంగా కొన్ని ప్రముఖ కంపెనీల వాహనాలను కూడా ప్రదర్శనకు ఉంచడం విశేషం.

టూ వీలర్, ట్రక్, విడిభాగాల రుణాలపై ఇవీ ప్రయోజనాలు...

టూ వీలర్, ట్రక్, విడిభాగాల రుణాలపై ఇవీ ప్రయోజనాలు...

* ప్రాసెసింగ్ ఫీజు ఉండదు

* సులభమైన ఈఎంఐ

* టూ వీలర్ ఆన్ రోడ్ ధరపై 100 శాతం వరకు, ట్రక్ వ్యయంలో 95 శాతం వరకు, ఎక్విప్ మెంట్ వాహన వ్యయంలో 85 శాతం వరకు తక్షణ రుణం అందించనున్నారు.

ఆటో, బంగారం, వ్యక్తిగత, ట్రాక్టర్ రుణాలపై ప్రయోజనాలు

ఆటో, బంగారం, వ్యక్తిగత, ట్రాక్టర్ రుణాలపై ప్రయోజనాలు

* ఆటో రుణాలపై ఫ్లాట్ రూ.999 ఫీజు, వ్యక్తిగత రుణంపై రూ.1,499, ట్రాక్టర్ రుణంపై రూ.2,000 ఫీజు (పన్నులు లేకుండా) వాసులు చేస్తారు.

* గానా డాట్ కామ్, సోనీ లివ్ ఏడాది సబ్ స్క్రిప్షన్

* రూ.2 లక్షలు దాటిన బంగారం రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు

కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు

కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు

* ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం డిస్కౌంట్, టెక్నికల్, లీగల్ వెరిఫికేషన్ చార్జీలు ఉండవు.

* ఐదేళ్ల కాలానికి నిబంధనలకు లోబడి కేసీసీ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం

షారుఖ్ ను కలవొచ్చు..

షారుఖ్ ను కలవొచ్చు..

* అప్పు తీసుకున్న కస్టమర్లు ఎస్సెమ్మెస్ ద్వారా క్విజ్ లో పాల్గొనవచ్చు. క్విజ్ పోటీలో టాప్ 100 విన్నర్లు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను కలిసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈయన బ్యాంక్ సెలెబ్రిటీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

English summary

అప్పు తీసుకోండి... షారుఖ్ ఖాన్ ను కలవండి... ఓ బ్యాంకు బంపర్ ఆఫర్ | ICICI Bank launches Maha Loan Dhamaka

ICICI Bank announced the launch of ‘Maha Loan Dhamaka’, an initiative to provide a bouquet of on-the-spot loan approvals. The Bank will host around 2000 such ‘Maha Loan’ camps across the country by end of March 2020. The Bank provides a comprehensive bouquet of exciting offerings and special packages on two and four wheelers, trucks, farming equipment and tractors, personal loan, gold loan and Kisan Credit Card at the ‘Maha Loan Dhamaka’.
Story first published: Sunday, November 17, 2019, 15:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X