ICICI Bank: మీకు ఐసీఐసీఐ బ్యాంక్ లో లోన్ ఉందా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..
ICICI Bank: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణం నేపథ్యంలో రెపో రేటు పెంచింది. దీనివల్ల ఇప్పటికే అనేక బ్యాంకులు తమ రుణాలపై వడ్డీలను పెంచటంతో పాటు ఫిక్స్ డ్ డిపాడిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. అయితే తాజాగా.. ఐసీఐసీఐ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR)ని అన్ని కాల వ్యవధిలో 20 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. అంతకుముందు జూన్ 1న ప్రైవేట్ రుణదాత ఐసీఐసీఐ MCLR రేటును 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
ఓవర్‌నైట్, ఒక నెల MCLR గత నెలలో 7.30 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో మూడు నెలల, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌లు కూడా వరుసగా 7.55 శాతం, 7.70 శాతానికి పెరిగాయి. ఒక సంవత్సరం MCLR 7.75 శాతానికి పెరిగినట్లు ICICI వెబ్‌సైట్ లో పొందుపరిచింది. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఐసీఐసీఐ షేర్లు 1.69 శాతం క్షీణించి 695.27 వద్ద ఉన్నాయి.

కానీ.. సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి షేర్ విలువ పుంజుకుని రూ.706 వద్ద స్థిరపడింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లకు భారీగా పెంచటం వల్ల నిఫ్టీ బ్యాంక్ సూచీ బేర్ జోన్‌లోకి పడిపోయింది. ఈ సూచీ SBI, ICICI, HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు మరో ఏడు ఇతర ప్రధాన బ్యాంకుల పనితీరును ట్రాక్ చేస్తుంది
ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ పెర్ఫియోస్ అకౌంట్ అగ్రిగేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (పెర్ఫియోస్ AA)లో ఒక్కొక్కటి 9.54 శాతం వాటాను కొనుగోలు చేశాయి. ఈ బ్యాంకులు ఒక్కోదానికి రూ.4.03 కోట్లు చెల్లించి 8,05,520 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశాయి.