For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ICICI Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్..

|

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ICICI బ్యాంక్ రూ.2 కోట్ల నుంచి రు.5 కోట్ల మధ్య గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త రేట్లు నవంబర్ 19, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ ఇప్పుడు 3.75% నుంచి 6.50% మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీలతో FDలను అందిస్తోంది. 1 నుంచి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఇప్పుడు గరిష్ట వడ్డీ రేటు 6.75% చెల్లిస్తుంది.

5.75% వడ్డీ
7 రోజుల నుంచి 29 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై బ్యాంక్ 3.75% వడ్డీ రేటును ఇస్తోంది. ICICI బ్యాంక్ 30 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై 4.75% వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుంచి 60 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై, ICICI బ్యాంక్ 5.00% వడ్డీ రేటును, 61 రోజుల నుండి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 5.25% వడ్డీని చెల్లిస్తుంది. 91 నుంచి 184 రోజుల మధ్య మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై ఇప్పుడు 5.75% వడ్డీ లభిస్తుంది.

ICICI Bank has increased interest rates on fixed deposits

HDFC బ్యాంక్
అయితే 185 నుంచి 270 రోజుల మధ్య మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై ఇప్పుడు 6.00% వడ్డీ రేటు లభిస్తుంది. 271 రోజుల నుండి 1 సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే FDలపై, బ్యాంక్ 6.25% వడ్డీ రేటును అందిస్తోంది. 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే వాటిపై ICICI బ్యాంక్ ఇప్పుడు 6.75% వడ్డీ రేటును అందిస్తోంది. HDFC బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.

English summary

ICICI Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్.. | ICICI Bank has increased interest rates on fixed deposits

ICICI Bank has increased interest rates on fixed deposits. The revised interest rates came into effect from November 19.
Story first published: Sunday, November 20, 2022, 12:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X