For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోం లోన్ తీసుకుంటున్నారా.. ఏ బ్యాంకులో వడ్డీ ఎలా ఉందంటే..

|

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేటును పెంచింది. ఆ వెంటనే అన్ని బ్యాంకులు కూడా గృహ రుణాల రేట్లను పెంచాయి . ఆర్బీఐ ఓసారి 90 బేసిస్ పాయింట్లు, మరోసారి 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పటి వరకు మొత్తం 140 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు గృహ రుణ రేట్లను పెంచేశాయి. ఆగస్టులో దేశంలోని 5 పెద్ద బ్యాంకులు వడ్డీ రేటును పెంచిన విషయం తెలిసిందే.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (EBLR)ని ఆగస్టులో పెంచింది. ఈ పెంపుతో ఎస్బీఐ వడ్డీ రేటు 8.05 శాతానికి చేరుకుంది. గతంలో ఈ రేటు 7.55 శాతంగా ఉండేది.

ICICI బ్యాంక్

ICICI బ్యాంక్

ఐసిఐసిఐ బ్యాంక్ ఆగస్టు నుంచి వడ్డి రేట్లను పెంచింది. ICICI బ్యాంక్ ప్రస్తుతం 8.85 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క రెపో లింక్డ్ లెండింగ్ రేటు ఆగస్టు 6, 2022 నుంచి అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం రిటైల్ రుణాలపై 7.95 శాతం వడ్డీ వసూలు చేస్తోంది.

కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇంతకుముందు ఈ రేటు 7.80 శాతం ఉండగా, దానిని 8.30 శాతానికి పెంచారు.

English summary

హోం లోన్ తీసుకుంటున్నారా.. ఏ బ్యాంకులో వడ్డీ ఎలా ఉందంటే.. | How much interest does a bank collect on home loans?

All banks have increased interest rates on loans after RBI hiked the repo rate. Let's see how much interest is charged in which bank
Story first published: Sunday, September 4, 2022, 18:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X