For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన రియల్ బిజినెస్, ఎంతగా అంటే?

|

కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాల్లో డిమాండ్ పడిపోయింది. ఆటో, రియల్ ఎస్టేట్ రంగాల్లో సేల్స్ దారుణంగా పడిపోయాయి. 2020 ఏప్రిల్ - జూన్ మధ్య వివిధ నగరాల్లో కొత్త ఇళ్ళ లాంచింగ్ ఏకంగా 98 శాతానికి పడిపోగా, హౌసింగ్ సేల్స్ 81 శాతం పడిపోయాయని ప్రాపర్టీ కన్సల్టెండ్ అనరాక్ తాజా నివేదిక వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా కరోనా కేసులు, 5 లక్షలకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. మన దేశంలో ఐదున్నర లక్షలకు పైగా కేసులు, 16వేల మరణాలు చోటు చేసుకున్నాయి.

ఏపీలో అపోలో టైర్స్ ఉత్పత్తి ప్రారంభం: తొలి దశలో రూ.3,800 కోట్ల పెట్టుబడులుఏపీలో అపోలో టైర్స్ ఉత్పత్తి ప్రారంభం: తొలి దశలో రూ.3,800 కోట్ల పెట్టుబడులు

మొదటి అర్ధ సంవత్సరంలో..

మొదటి అర్ధ సంవత్సరంలో..

కరోనా - లాక్ డౌన్ కారణంగా 2020 మొదటి అర్ధ సంవత్సరంలో హౌసింగ్ సేల్స్ 42,610గా ఉన్నాయి. మొదటి అర్ధ సంవత్సరంలో న్యూ లాంచింగ్స్ 56 శాతం పడిపోయాయి. కొత్తగా లాంచ్ అయిన వాటిలో 10,490తో ముంబై మొదటి స్థానంలో ఉంటే 9,190తో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సేల్స్ 49 శాతం తగ్గి 57,940 యూనిట్లకు పరిమితమయ్యాయి. ప్రధాన నగరాల్లో 46 శాతం నుండి 51 శాతానికి పడిపోయాయి. ముంబైలో 17,530 యూనిట్లు, బెంగళూరులో 11,620 యూనిట్లు సేల్ అయ్యాయి.

2013 కంటే తక్కువకు

2013 కంటే తక్కువకు

కొత్త ఇంటి లాంచింగ్స్ 2013 నుండి ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో అతి తక్కువగా నమోదయ్యాయి. జనవరి-మార్చితో పోలిస్తే 98 శాతం తగ్గాయి. ఇక, 2019 ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో 68,600 యూనిట్లు సేల్ అయితే ఈసారి ఏకంగా 12,740కి పడిపోయింది. క్వార్టర్ ప్రాతిపదికన సేల్స్ 45,200 యూనిట్ల నుండి 72 శాతం పడిపోయాయి. మొత్తానికి ఇండియాలోని 7 నగరాల్లో సేల్స్, న్యూ లాంచింగ్స్ రికార్డ్ స్థాయికి పడిపోయాయి.

ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో...

ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో...

ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‍‌లో సేల్స్ గత ఏడాదితో పోలిస్తే భారీగానే పడిపోయాయి. 2019లో ఏప్రిల్-జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి 83 శాతం పడిపోయాయి. అలాగే, అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే 74 శాతం పడిపోయాయి. కొత్త ప్రారంభోత్సవాలు వంద శాతం పడిపోయాయి.

పుణే, కోల్‌కతాలో డౌన్

పుణే, కోల్‌కతాలో డౌన్

పుణేలో ఈ క్వార్టర్‌లో కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే ప్రారంభమైంది. మొత్తం 4 ప్రాజెక్టులు కాగా రెండు బెంగళూరులో, ఒకటి కోల్‌కతా కాగా మరొకటి పుణేలో. 2019లో ఇదే క్వార్టర్‌లో 10,700 యూనిట్లు సేల్ కాగా, ఈసారి మాత్రం 750కి పరిమితమైంది. అంటే 93 శాతం తగ్గుదల నమోదయింది. జనవరి - మార్చి క్వార్టర్ 7,800 యూనిట్లతో పోలిస్తే 90 శాతం పడిపోయింది.

కోల్‌కతాలో గత ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 98 శాతం తగ్గుదల, అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే 95 శాతం తగ్గుదల నమోదయింది. సేల్స్ 77 శాతం పడిపోయాయి.

చెన్నై, బెంగళూరులో..

చెన్నై, బెంగళూరులో..

2020 ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో బెంగళూరులో 2,990 యూనిట్లు సేల్ అయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో 13,150 సేల్ అయ్యాయి. 2020 జనవరి క్వార్టర్‌లో 8,630 యూనిట్లు సేల్ అయ్యాయి. ఏడాది ప్రాతిపదికన 77 శాతం, క్వార్టర్ ప్రాతిపదికన 65 శాతం పడిపోయాయి. న్యూ లాంచింగ్స్ కేవలం రెండు ప్రాజెక్టులు మాత్రమే.

చెన్నైలో క్వార్టర్ ప్రాతిపదికన సేల్స్ 79 శాతం, న్యూ ప్రాజెక్టులు 100 శాతం పడిపోయాయి.

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టులు నిలిచిపోయాయి. హౌసింగ్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 85 శాతం పడిపోయాయి. 2019లో ఇదే సమయంలో 4,430 సేల్ కాగా, ఈ ఏడాది 630కి పడిపోయాయి. క్వార్టర్ ప్రాతిపదికన 2,680 ఉండగా 75 శాతం పడిపోయాయి. గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. కొంతలో కొంత బెంగళూరు రియల్ మార్కెట్ మిగతా నగరాల కంటే కొంత యాక్టివ్‌గా ఉంది. హైదరాబాద్‌లో సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉండటంతో సేల్స్ భారీగా పడిపోయాయి.

English summary

హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన రియల్ బిజినెస్, ఎంతగా అంటే? | Housing sales drop 85 per cent in Hyderabad, says ANAROCK

As per the latest report by property consultants ANAROCK, around 12,740 housing units were sold in Q2, 2020 against 68,600 units in Q2, 2019. on q-o-q basis. Sales dropped by 72 per cent from 45,200 units in Q1 2020. Housing sales and new launches have dipped to a record low across India's top 7 cities in Q2, 2020.
Story first published: Tuesday, June 30, 2020, 13:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X