For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో 74% తగ్గిన హోమ్‌సేల్స్, అక్కడ మాత్రం పెరిగాయి

|

కరోనా వైరస్ నేపథ్యంలో ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో వివిధ నగరాల్లో హౌసింగ్ సేల్స్ 67 శాతం పడిపోయినట్లు డేటా అనలటిక్స్ ఫర్మ్ ప్రోప్ ఈక్విటీ తెలిపింది. ఏడాది క్రితం ఇదే సమయంలో 64,378 హౌసింగ్ సేల్స్ ఉండగా ఇప్పుడు మూడొంతులకు పైగా తగ్గి 21,294 యూనిట్లకు పడిపోయింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో హౌసింగ్ సేల్స్ 81 శాతం పడిపోయి 12,740 యూనిట్లుగా ఉన్నట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ ఫర్మ్ అనరాక్ ఇటీవల తెలిపింది.

చైనాకు బ్యాంకు కస్టమర్ల భయాందోళన షాక్, లార్జ్ మనీ తీసుకోవాలంటే.. కొత్త నిబంధనలుచైనాకు బ్యాంకు కస్టమర్ల భయాందోళన షాక్, లార్జ్ మనీ తీసుకోవాలంటే.. కొత్త నిబంధనలు

చెన్నై, హైదరాబాద్‌లో 74 శాతం తగ్గుదల

చెన్నై, హైదరాబాద్‌లో 74 శాతం తగ్గుదల

ప్రాప్-ఈక్విటీ రిపోర్ట్ ప్రకారం నోయిడాను మినహాయించి గురుగ్రామ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, థానే, పుణే, కోల్‌కతా వంటి ఎనిమిది ప్రధాన నగరాల్లో సేల్స్ తగ్గిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో గురుగ్రామ్‌లో 79 శాతం సేల్స్ పడిపోయి 361 యూనిట్లకు తగ్గాయి. అంతకుముందు ఇదే కాలంలో 1,707 యూనిట్లు సేల్ అయ్యాయి. హైదరాబాద్, చెన్నై నగరాల్లో 74 శాతం పడిపోయాయి. చెన్నైలో 996 యూనిట్లు, హైదరాబాద్‌లో 1,552 యూనిట్లు సేల్ అయ్యాయి.

బెంగళూరు, ముంబైలో ఎంత తగ్గాయంటే

బెంగళూరు, ముంబైలో ఎంత తగ్గాయంటే

బెంగళూరులో హౌసింగ్ సేల్స్ గత ఏడాది ఇదే కాలంలో 10,583 ఉండగా ఈసారి 73 శాతం పడిపోయి 2,818 యూనిట్లకు తగ్గాయి. కోల్‌కతాలో 75 శాతం పడిపోయి 4,152 యూనిట్ల నుండి 1,046కు పరిమితమయ్యాయి. ముంబైలో 63 శాతం తగ్గి 2,206, థానేలో 56 శాతం తగ్గి 5,999, పుణేలో 70 తగ్గి 5,169 యూనిట్లకు పరిమితమయ్యాయి.

నోయిడాలో మాత్రం పెరుగుదల

నోయిడాలో మాత్రం పెరుగుదల

నేషనల్ క్యాపిటల్ రీజియన్ నోయిడాలో మాత్రం హౌసింగ్ సేల్స్ పెరగడం గమనార్హం. ఇక్కడ 5 శాతం పెరిగి గత ఏడాది 1,123 ఉండగా ఈసారి 1,177 యూనిట్లుగా ఉన్నాయి. ఇక కొత్త లాంచింగ్స్ 78 శాతం పడిపోయాయి. అమ్ముడుపోనివి 5 శాతం తగ్గి 6,07,665గా ఉన్నాయి.

English summary

హైదరాబాద్‌లో 74% తగ్గిన హోమ్‌సేల్స్, అక్కడ మాత్రం పెరిగాయి | Home sales plummet 67 percent in June quarter

COVID-19 pandemic and the subsequent nationwide lockdown have led to a fall in housing sales that plunged 67 per cent across the top nine cities during April-June (2020), according to a report by data analytics firm PropEquity.
Story first published: Friday, July 10, 2020, 18:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X