For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇళ్ల ధరలు తగ్గాయ్, 56 దేశాల్లో చివరి నుండి రెండో స్థానంలో భారత్

|

భారతదేశంలో ఇంటి ధరలు గత ఏడాది (2020) మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది (2021) మార్చి త్రైమాసికంలో 1.6 శాతం మేర క్షీణించాయని ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ తన తాజా రీసెర్చ్ నివేదిక గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్-Q12021లో వెల్లడించింది. అంతర్జాతీయంగా కూడా భారత్ ర్యాంకు తగ్గింది. 2020 క్యాలెండర్ ఇయర్ Q1లో 43వ ర్యాంకులో ఉన్న భారత్ 2021 క్యాలెండర్ ఇయర్ Q1లో 12 స్థానాలు తగ్గి 55వ స్థానానికి పడిపోయింది. అయితే డిసెంబర్ త్రైమాసికం 56వ స్థానంతో పోలిస్తే మాత్రం కాస్త ముందుకు జరిగింది. మార్చి త్రైమాసికంలో ఒక స్థానం ముందుకు వచ్చింది.

సూపర్ రిచ్ జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్‌లు పన్నులు కూడా చెల్లించలేదు!సూపర్ రిచ్ జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్‌లు పన్నులు కూడా చెల్లించలేదు!

టర్కీ ఫస్ట్, స్పెయిన్ లాస్ట్

టర్కీ ఫస్ట్, స్పెయిన్ లాస్ట్

జూలై-సెప్టెంబర్ 2020 త్రైమాసికంతో పోలిస్తే ఇళ్ల ధరల వృద్ధి 0.6 శాతం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.4 శాతం వద్ధి నమోదు చేసింది. 56 దేశాలు టెర్రిటరీస్ ఇళ్ల ధరల సూచీలను గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ పరిగణలోకి తీసుకుంది. Q1 2020 నుండి Q1 2021 మధ్య టర్కీ అన్ని దేశాల కంటే ముదు ఉంది. టర్కీలో ఏడాది ప్రాతిపదికన 32 శాతం, న్యూజిలాండ్ 22.1 శాతం, లగ్జెంబర్గ్ 16.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఏడాది ప్రాతిపదికన 1.8 శాతం క్షీణతతో స్పెయిన్ చివరలో నిలిచింది. ఆ తర్వాత భారత్ 1.6 శాతం క్షీణతతో ఉంది.

అమెరికాలో 15 ఏళ్ల తర్వాత

అమెరికాలో 15 ఏళ్ల తర్వాత

2005 నుండి అత్యధిక వార్షిక వృద్ధి అమెరికా నమోదు చేసింది. అగ్రరాజ్యంలో ఏడాది ప్రాతిపదికన 13.2 శాతం నమోదయింది. 56 దేశాలు, టెర్రిటరీల్లో సగటున 7.3 శాతం వృద్ధి నమోదయింది. ఏడాది ప్రాతిపదికన నాలుగు దేశాల్లో 7 శాతం క్షీణత నమోదయింది. అదే సమయంలో 13 దేశాలు, టెర్రిటరీస్‌లలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదయింది. భారత దేశంలో సేల్స్ వ్యాల్యూమ్ క్రమంగా పుంజుకుంటోందని వెల్లడించింది. అంతకుముందు త్రైమాసికంలో ముంబై పుణే వంటి ప్రాంతాల్లో హౌసింగ్ సేల్స్ కరోనా ముందుస్థాయికి చేరుకొని రికవరీ కనిపించింది.

దేశాల ర్యాంకులు...

దేశాల ర్యాంకులు...

వరుసగా ఐదో ఏడాది టర్కీ మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్ (22.1 శాతం), లగ్జెంబర్గ్ (16.6 శాతం), స్లొవేకియా (15.5 శాతం), అమెరికా (13.2 శాతం), స్వీడన్ (13 శాతం), ఆస్ట్రియా (12.3 శాతం), నెదర్లాండ్స్ (11.3 శాతం), రష్యా (11.1 శాతం), కెనడా (11 శాతం) ఉన్నాయి.

English summary

ఇళ్ల ధరలు తగ్గాయ్, 56 దేశాల్లో చివరి నుండి రెండో స్థానంలో భారత్ | Home prices grew about 1 percent in March quarter, Knight Frank report

India moved down 12th spot in the global home price index to 55th in the March quarter. It was decline 1.6 percent year on year.
Story first published: Friday, June 11, 2021, 15:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X