For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Home Loan: మరింత పెరగనున్న హోం లోన్ వడ్డీ..! ఈఎంఐ పెంచుకోవడమా లేక వ్యవధి పెంచుకోవాలా..!

|

హోం లోన్ తీసుకున్న వారికి ఈ ఏడాది వడ్డీ భారం పెరిగింది. ఇప్పటికే పలుమార్లు లోన్ వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు మరోసారి వడ్డీ రేటు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్బీఐ తాజాగా రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో బ్యాంకులు కూడా వడ్డీ రేటు పెంచనున్నాయి. ఆర్‌బిఐ ఇప్పటికే నాలుగు ద్రవ్య విధాన సమావేశాలలో రెపో రేటును 1.90 శాతం పెంచింది. అంటే 8 నెలల్లో ఆర్‌బీఐ రెపో రేటును 4 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది.

వడ్డీ రేట్లు

వడ్డీ రేట్లు

RBI రెపో రేటు పెంపుతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు,హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాల వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీంతో రుణాల వడ్డీ రేట్లు పెరగడంతో EMI పెరగనున్నాయి. రెపో రేటుతో అనుసంధానించబడిన గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడంతో ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేట్లలో 0.35 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉంది. గృహ రుణాలే కాదు మిగతా రుణాలపై కూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత వడ్డీ రేటు 8.40 శాతం

ప్రస్తుత వడ్డీ రేటు 8.40 శాతం

ఉదాహరణకు మీరు ఎస్బీఐలో ప్రస్తుత వడ్డీ రేటు 8.40 శాతం ప్రకారం 20 సంవత్సరాల కాలానికి రూ. 25 లక్షల గృహ రుణం తీసుకుంటే.. మీరు నెలకు రూ. 21,538 చెల్లించాల్సి ఉంటుంది. కానీ రెపో రేటులో 35 బేసిస్ పాయింట్లు పెరిగిన తర్వాత, వడ్డీ రేటు 8.75 శాతానికి పెరుగుతుంది, దానిపై EMI రూ. 22,093 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీ EMI ధర రూ. 555 పెరుగుతుంది. అంటే సంవత్సరంలో రూ. 6,660 ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.

60 ఏళ్లకు

60 ఏళ్లకు

వడ్డీ రేటు పెరిగితే ఈఎంఐ పెరుగుతోంది. అయితే ఈఎంఐ పెంచుకోకుండా లోన్ రీ పే చేసే వ్యవధిని పెంచుకోవచ్చు.

ఇది రుణగ్రహీతల ఇష్టం. వారికి ఈఎంఐ పెరిగినా ఫర్వాలేదు అనుకుంటే వారు పెరిగిన ఈఎంఐని చెల్లించుకోవచ్చు. వయస్సు ఎక్కువ ఉన్నవారు లోన్ రీ పే చేసే వ్యవధి పెంచుకోలేరు. ఉదాహరణకు ఒక వ్యక్తి 45 ఏళ్ల వయస్సులో 15 సంవత్సరాల కాలానికి రూ.20 లక్షలు గృహ రుణం తీసుకుంటే.. అతను లోన్ రీ పే చేసే వ్యవధి పెంచుకోలేరు. ఎందుకంటే అతను 15 సంవత్సరాల తర్వాత 60 ఏళ్లకు చేరుతాడు. దీంతో అతను వ్యవధిని పెంచుకోలేరు.

English summary

Home Loan: మరింత పెరగనున్న హోం లోన్ వడ్డీ..! ఈఎంఐ పెంచుకోవడమా లేక వ్యవధి పెంచుకోవాలా..! | Home loan EMIs will increase with RBI repo rate hike

With the increase in RBI repo rate, government, private banks and housing finance companies are likely to increase interest rates on home loans. As the loan interest rates increase, the EMI will increase.
Story first published: Wednesday, December 7, 2022, 11:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X