For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్ , సీఎన్జీ ఇక నుండి ఇంటికే .. ఆయిల్ కంపెనీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

|

చమురు కంపెనీలకు పెట్రోల్, సిఎన్‌జిల హోం డెలివరీని ప్రారంభించడానికి కేంద్రం త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది . దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ పరిమితుల సమయంలో వాహన యజమానులకు సహాయం చేయడానికి చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు .ఇక కేంద్రం కూడా దీనికి పచ్చ జెండా వూపినట్టుగా ఆయన చెప్పారు.

 డీజిల్ మాదిరిగానే పెట్రోల్, సిఎన్‌జిలు కూడా ఇంటికే

డీజిల్ మాదిరిగానే పెట్రోల్, సిఎన్‌జిలు కూడా ఇంటికే

డీజిల్ మాదిరిగానే పెట్రోల్, సిఎన్‌జిల ను కూడా ఇంటికే పంపిణీ చేసేలా ప్రభుత్వాన్ని చమురు సంస్థలు కోరుతున్నాయని మంత్రి పేర్కొన్నారు . ఇప్పటికే డీజిల్ హోం డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే . భవిష్యత్తులో ప్రజలకు కావాల్సిన ఇంధనాన్ని ఇంటికి డెలివరీ చేస్తారు అన్న భావన కలుగుతుంది. భారతదేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2018 లో భారతదేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మొబైల్ డిస్పెన్సర్‌ల ద్వారా డీజిల్‌ను ఇంటికి పంపిణీ చేయడం ప్రారంభించింది.

 మొబైల్ పెట్రోల్ పంప్ లతో ఇండియన్ స్టార్టప్ రెపోస్ ఎనర్జీ

మొబైల్ పెట్రోల్ పంప్ లతో ఇండియన్ స్టార్టప్ రెపోస్ ఎనర్జీ

భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉంది, కాని కరోనా కారణంగా విధించిన దేశ వ్యాప్త లాక్డౌన్ ఫలితంగా డిమాండ్ భారీగా పడిపోయింది. భారతదేశంలో ఇంధన వినియోగం ఏప్రిల్‌లో దాదాపు 70% తగ్గింది. పెట్రోల్ డిమాండ్ గత సంవత్సరం ఇదే సమయంలో 47% కన్నా తక్కువగా ఉంది, డీజిల్ వినియోగం 35% తక్కువ.

ఇటీవల, రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ మద్దతుతో ఇండియన్ స్టార్టప్ రెపోస్ ఎనర్జీ, ఇంట్లో ఇంధనాన్ని అందించడానికి మొబైల్ పెట్రోల్ పంపులతో ముందుకు రావాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది.

3,200 మొబైల్ పెట్రోల్ పంపుల ఏర్పాటు

3,200 మొబైల్ పెట్రోల్ పంపుల ఏర్పాటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి 3,200 మొబైల్ పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పూణేకు చెందిన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.సిఎన్‌జి, ఎల్‌ఎన్‌జి, పిఎన్‌జిలతో సహా అన్ని రకాల ఇంధనాలను ఒకే చోట అందించడానికి త్వరలో ఇంధన కేంద్రాలను పునరుద్ధరించనున్నట్లు చమురు మంత్రి సూచించారు. ఏదేమైనా, వాహనాల కోసం సహజ వాయువును రిటైల్ చేసే పంపుల దగ్గర ప్రజల రద్దీని తగ్గించటం కోసం ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు .

11 రాష్ట్రాల్లో 56 కొత్త సిఎన్జి స్టేషన్లను ప్రారంభించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

11 రాష్ట్రాల్లో 56 కొత్త సిఎన్జి స్టేషన్లను ప్రారంభించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, న్యూ ఢిల్లీ , పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్లలో 11 రాష్ట్రాల్లో 56 కొత్త సిఎన్జి స్టేషన్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇది రోజూ 50,000 వాహనాలను నింపడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు .ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, "కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వలన ఈ స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి.

 ఆయిల్ కంపెనీలకు పచ్చ జెండా ఊపిన కేంద్రం

ఆయిల్ కంపెనీలకు పచ్చ జెండా ఊపిన కేంద్రం

అయితే, గత నెలలో ఆంక్షలను సడలించిన తరువాత, పని వేగవంతం అయ్యింది . భద్రత మరియు సామాజిక దూర నిబంధనలు దృష్టిలో పెట్టుకుని ఇంటికే పెట్రోల్ మరియు సీఎన్జీ సేవలు అందించాలని భావిస్తున్నారు. పెట్రోల్, సీఎన్‌జీలను కూడా ఇంటివద్దనే ప్రజలకు అందించేలా ఆయిల్ కంపెనీలు చేసిన ప్రతిపాదనకు కేంద్రం పచ్చజెండా ఊపిందని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.

English summary

పెట్రోల్ , సీఎన్జీ ఇక నుండి ఇంటికే .. ఆయిల్ కంపెనీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ | Home delivery of petrol, CNG .. green signal to oil companies

The Centre could gave a green signal for oil companies to begin home delivery of petrol and CNG. Oil Minister Dharmendra Pradhan gave hint to this step on Friday to help vehicle owners during the ongoing lockdown restrictions across the country.
Story first published: Saturday, May 30, 2020, 16:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X