For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకర్లలో HDFC ఆదిత్యపురి శాలరీయే ఎక్కువ, వారికంటే 139% వేతనం ఎక్కువ

|

2020-21 ఆర్థిక సంవత్సరంలో ముందు నిలిచిన మూడు ప్రయివేటురంగ బ్యాంకుల అధినేతల్లో అత్యధిక వేతనం అందుకున్న వ్యక్తిగా HDFC బ్యాంకుకు చెందిన ఆదిత్యపురి నిలిచారు. గత ఆర్థిక సంవత్సరం పదవీ విరమణ చేసిన ఆయన మొత్తం రూ.13.82 కోట్ల వేతనం అందుకున్నారు. ఆదిత్యపురి వారసుడు, HDFC బ్యాంకు సీఈవో, ఎండిగా పగ్గాలు చేపట్టిన శశిధర్ జగదీషన్ రూ.4.77 కోట్ల స్థూల వేతనం అందుకున్నారు. ఆదిత్య పురి అందుకున్న మొత్తం వేతనంలో రూ.3.5 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో సందీప్ భక్తి కరోనా నేపథ్యంలో స్థిర వేతనంలో బేసిక్, అదనపు అలవెన్స్ వదులుకున్నారు.

ఈ 3 బ్యాంకుల చీఫ్స్‌కు వేతనం ఎంతంటే

ఈ 3 బ్యాంకుల చీఫ్స్‌కు వేతనం ఎంతంటే

అధిక వేతనం అందుకున్న టాప్ మూడు ప్రయివేటురంగ బ్యాంకుల అధినేతల్లో HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల చీఫ్స్ ఉన్నారు. ఇందులో HDFC ఆదిత్య పూరి రూ.13.82 కోట్ల వేతనం అందుకున్నారు. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న శశిధర్ జగదీషన్ రూ.4.77 కోట్లు అందుకున్నారు.

ఐసీఐసీఐ భక్షి మాత్రం అలవెన్స్, ఇతరాలు కలిసి రూ.38.38 లక్షలు అందుకున్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీకి సంబంధించి FY17, FY18లో వాయిదా వేసిన వేతనం రూ.63.60 లక్షలు కూడా వచ్చింది.

యాక్సిస్ బ్యాంకుకు చెందిన అమితాబ్ చౌదరి రూ.6.52 కోట్లు అందుకున్నారు. FY21లో టాప్ మేనేజ్‌మెంట్‌కు వేతన పెంపు అమలు కాలేదని తెలిపింది.

స్వచ్చంధంగా తగ్గింపు

స్వచ్చంధంగా తగ్గింపు

ఐసీఐసీఐ బ్యాంకు విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీతో సహా మెటిరీయల్ రిస్క్ తీసుకునేవారు తమ చెల్లింపుల్లో మే 1వ తేదీ నుండి పది శాతం వేతానాన్ని స్వచ్చంధంగా తగ్గించుకున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇలా తగ్గించుకోవచ్చు. హోల్‌సేల్ బ్యాంకింగ్ డైరెక్టర్-ఇన్-చార్జ్ విశాఖ మూల్యే వార్షిక నివేదిక ప్రకారం రూ.5.64 కోట్లు అందుకున్నారు.

మధ్యస్థాయి ఉద్యోగితో పోలిస్తే 139 రెట్లు

మధ్యస్థాయి ఉద్యోగితో పోలిస్తే 139 రెట్లు

ఒక బ్యాంకు మధ్యస్థాయి ఉద్యోగి వేతనంతో పోలిస్తే HDFC జగదీషన్ 139 రెట్లు అధిక వేతనం అందుకున్నారు. అలాగే అమితాబ్ చౌదరి 104 రెట్లు, ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు 96 శాతం అధికంగా అందుకున్నారు. డేటా ప్రకారం కోటీశ్వరులైన వారు అంటే నెలకు రూ.8.5 లక్షలు సంపాదించేవారు చాలామంది ఉన్నారు. ఈ జాబితాలో HDFC బ్యాంకు 200 ఉద్యోగులను, యాక్సిస్ బ్యాంకు 69 మందిని కలిగి ఉంది.

English summary

బ్యాంకర్లలో HDFC ఆదిత్యపురి శాలరీయే ఎక్కువ, వారికంటే 139% వేతనం ఎక్కువ | HDFC's Aditya Puri highest paid banker, ICICI's Bakhshi forgoes salary

HDFC Bank's Aditya Puri emerged as the highest grossing banker. His total emoluments stands at Rs 13.82 crore in his retirement year.
Story first published: Monday, July 26, 2021, 8:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X