For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC Q1 net profit: వేల కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్: అదరగొట్టిన తొలి రిజల్ట్: అయినా

|

ముంబై: ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవించిన హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) అదరగొట్టే ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నికర లాభాన్ని భారీగా పెంచుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నెట్ ప్రాఫిట్‌లో 16.1 శాతం వృద్ధి కనిపించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలానికి ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 16.1 శాతం వృద్ధితో 7,790.60 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను అందుకుందా బ్యాంక్ యాజమాన్యం.

 లక్ష్యానికి దిగువే..

లక్ష్యానికి దిగువే..

అయినప్పటికీ- తమ తొలి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాల పట్ల బ్యాంక్ యాజమాన్యం ఒకింత నిరాశను వ్యక్తం చేసింది. ఆశించిన స్థాయిలో, అంచనాలకు అనుగుణంగా ఈ ఫలితాలు లేవని అభిప్రాయపడుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాజమాన్యం తాజాగా నమోదు చేసిన తొలి త్రైమాసిక ఫలితాల్లో కాస్త మెరుగుపడినట్టే. గత ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే 16.1 శాతం మేర వృద్ధి కనిపించింది.

7,790 కోట్ల రూపాయల వద్ద

7,790 కోట్ల రూపాయల వద్ద

గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోబ్యాంకు అందుకున్న లాభాలు 6,658,60 కోట్ల రూపాయలు. ఈ సారి 16.1 శాతం వృద్ధితో 7,790.60 కోట్ల రూపాయలను ఆర్జించింది. నిజానికి ఈ మొత్తం కనీసం 7,900 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాజమాన్యం అంచనా వేసింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌లో దాదాపు అన్ని రాష్ట్రాలు అమలు చేసిన లాక్‌డౌన్ తరహా పరిస్థితుల వల్ల లక్ష్యాన్ని అందుకోలేకపోయినట్లు బ్యాంక్ యాజమాన్యం చెబుతోంది.

లాక్‌డౌన్ తరహా పరిస్థితుల వల్లే..

లాక్‌డౌన్ తరహా పరిస్థితుల వల్లే..

లాక్‌డౌన్ సమయంలో రుణాలు తీసుకునే వారి సంఖ్య తగ్గడం, నిర్మాణ రంగం స్తంభించిపోవడం, ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో కొనసాగకపోవడం వంటి కారణాల వల్ల 7,900 కోట్ల రూపాయల లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని పేర్కొంటోంది. బ్యాంక్ నికర వడ్డీల ద్వారా ఆర్జించిన లాభాలు 17,009 కోట్ల రూపాయలకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ మొత్తం 15,665.70 కోట్ల రూపాయలు. తొలి త్రైమాసికంలో మొత్తం ఆర్థిక లావాదేవీలు 36,771 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలానికి బ్యాంక్ రికార్డ్ చేసిన లావాదేవీలు 34,453 కోట్ల రూపాయలు.

నిరర్ధక ఆస్తుల విలువలో స్వల్పంగా పెరుగుదల

నిరర్ధక ఆస్తుల విలువలో స్వల్పంగా పెరుగుదల

కాగా- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరిధిలో ఉన్న నిరర్థక ఆస్తుల విలువ కూడా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 1.36గా ఉన్న ఈ సంఖ్య ఏడాది తిరిగే సరికి 1.47 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అంటే జనవరి-మార్చి మధ్యన 1.32గా ఉన్న నిరర్థక ఆస్తుల శాతం.. ఈ మూడు నెలల కాలంలో స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసుకుంది. కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్‌లో 14.36 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.

English summary

HDFC Q1 net profit: వేల కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్: అదరగొట్టిన తొలి రిజల్ట్: అయినా | HDFC Q1 result: net profit jumps up 16% at Rs 7,730 cr, total income records 6.7%

The country's largest private sector lender HDFC bank had posted a consolidated net profit of Rs 6,927.24 crore in the corresponding quarter a year ago. The June quarter profit has dipped as against the preceding March quarter's Rs 8,433.78 crore.
Story first published: Saturday, July 17, 2021, 15:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X