For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లు క్రాస్

|

ముంబై: ప్రయివేటురంగ దిగ్గజం HDFC లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లు దాటింది. నేడు ఈ సంస్థ స్టాక్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.2,808ని తాకాయి. దీంతో బ్యాంకు మార్కెట్ క్యాప్ కూడా పెరిగింది. మధ్యాహ్నం గం.2 గంటల సమయానికి ఈ స్టాక్ రూ.2772 వద్ద ట్రేడ్ అయింది. అయితే ఉదయం రూ.2800 దాటింది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి చివరి వారంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నాడు HDFC స్టాక్ 1500 స్థాయికి పడిపోయింది. నాటి నుండి ఇప్పడి వరకు దాదాపు 90 శాతం లాభపడింది.

రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ దాటిన ఆరో భారతీయ కంపెనీ HDFC లిమిటెడ్. ఇంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), HDFC బ్యాంకు లిమిటెడ్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఈ మార్కును దాటాయి. ప్రస్తుతం భారత అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13.02 లక్షల కోట్లు. రూ.12.05 లక్షల కోట్లతో టీసీఎస్ రెండో స్థానంలో, రూ.8.75 లక్షల కోట్లతో HDFC బ్యాంకు మూడో స్థానంలో ఉన్నాయి.

 HDFC Ltd hits Rs5 trillion in market cap

డిసెంబర్ నెలలో HDFC లిమిటెడ్ రూ.2,930 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికిన ఇది 65 శాతం తక్కువ. నెట్ ఇంటరెస్ట్ ఇన్‌కం 25% పెరిగి రూ.4,000 కోట్లుగా నమోదయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 29% పెరిగి రూ.4,190 కోట్లుగా నమోదయింది. లోన్ బుక్ ఏడాది ప్రాతిపదికన 9.3 శాతం ఎగిసి 4.7 లక్షల కోట్లుగా ఉంది. ఇండివిడ్యువల్, నాన్ ఇండివిడ్యువల్ లోన్ బుక్ వరుసగా 10.5%, 8%కు పెరిగాయి. అసెట్ అండర్‌మేనేజ్‌మెంట్ 9.3 శాతానికి పెరిగింది. ప్రధానంగా ఇండివిడ్యువల్ హోమ్ లోన్ రంగం ఇటీవల భారీగా ఎగిసిందని, ఇది కలిసి వచ్చిందని బ్రోకరేజీ సంస్థ ఫిలిప్‌క్యాపిటల్ పేర్కొంది.

English summary

HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లు క్రాస్ | HDFC Ltd hits Rs5 trillion in market cap

Mortgage lender HDFC Ltd. hit Rs5 trillion in market capitalisation on Friday, after its shares surged to touch a record high of Rs2,808 apiece on the BSE.
Story first published: Friday, February 12, 2021, 15:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X