For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో రెండు లక్షల గ్రామాలకు HDFC బ్యాంకు సేవలు

|

రానున్న 18-24 నెలల కాలంలో తాము దేశంలోని రెండు లక్షల గ్రామాలలో సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC వెల్లడించింది. ప్రస్తుతం ఒక లక్ష గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు ఉన్నాయి. తమ నెట్ వర్క్‌ను మరిన్ని గ్రామాల్లోకి విస్తరిస్తామని తెలిపింది. బ్రాంచ్ నెట్ వర్క్, బిజినెస్ కరస్పాండెంట్స్, బిజినెస్ ఫెసిలిటేటర్స్, డిజిటల్ ఔట్‍‌‌రీచ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా విస్తరిస్తామని తెలిపింది. తమ తాజా టార్గెట్ నెరవేరితే మొత్తం మూడో వంతు గ్రామాలకు విస్తరించినట్లవుతుందని వెల్లడించింది.

బ్యాంకింగ్, లోన్స్ విషయంలో దేశంలోని గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లలో పరిమిత సేవలు అందుతున్నాయని, వాస్తవానికి ఈ ప్రాంతాలు బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిర, దీర్ఘకాలిక అభివృద్ధికి విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయని HDFC బ్యాంకు కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ రాహుల్ శుక్లా తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పిన్‌కోడ్ పరిధిలో తమ సేవలు అందేలా ముందుకు వెళ్తున్నామన్నారు. బ్యాంకు సేవల విస్తరణ ప్రణాళికలో భాగంగా రానున్న ఆరు నెలల కాలంలో 2,500 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

 HDFC Bank to double rural reach to two lakh villages in two years

కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారుస్తోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో బాధ్యతాయుత పాత్రగా సమాజంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన సేవలను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నామన్నారు. డిజిటల్ వేదికల ద్వారా మారుమూల ప్రాంతాలకు సేవలు అందిస్తామన్నారు.

English summary

త్వరలో రెండు లక్షల గ్రామాలకు HDFC బ్యాంకు సేవలు | HDFC Bank to double rural reach to two lakh villages in two years

HDFC Bank aims to cover a third of India’s villages, by expanding its reach to two lakh villages in the next 18-24 months
Story first published: Sunday, September 26, 2021, 21:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X