For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Home Loan: పండుగ బొనాంజా ఆఫర్.. హోల్ లోన్ వడ్డీ రేట్లు తగ్గించిన దిగ్గజ బ్యాంక్..

|

Home Loan: ఇల్లు కొనుక్కోవాలన్నది ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద కల. వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో ప్రేవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ మాత్రం తన హోమ్ లోన్ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. ఇది లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవాలనుకునేవారికి చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి.

దీపావళి సందర్భంగా..

దీపావళి సందర్భంగా..

దీపావళికి ముందే రేట్ల తగ్గింపు ప్రకటించటం అనేక మందిని కొత్త ఇళ్లు కొనుక్కునే వైపు నడిపిస్తోంది. కస్టమర్లు తమకు నచ్చిన రేంజ్ లో ఖరీదైన ఇళ్లను కొనుక్కోవటానికి, వారి కలలను సాకారం చేసుకోవటానికి రుణాలు పొందటం ఇప్పుడు లాభదాయకమైనదని చెప్పుకోవచ్చు. సాధారణంగా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు పండుగ సీజన్లలో తమ ప్రియమైన కస్టమర్లకు లాభదాయకమైన డీల్స్ అందిస్తుంటాయి. అయితే వడ్డీ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వడ్డీ రేట్ల తగ్గింపు చాలా ఆకర్షనీయంగా నిలుస్తోంది.

వడ్డీ రేటు ఎంతంటే..

వడ్డీ రేటు ఎంతంటే..

ప్రముఖ మార్ట్‌గేజ్ ప్లేయర్ హెచ్‌డిఎఫ్‌సి తమ హాలిడే డీల్స్‌లో భాగంగా వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ తక్కుఆవ వడ్డీ రేట్లను 8.40 శాతంగా ప్రకటించింది. అతిపెద్ద ప్యూర్-ప్లే మార్ట్‌గేజ్ ప్రొవైడర్ HDFC కొత్త కస్టమర్‌లకు 20 బేసిస్ పాయింట్లు తక్కువ వడ్డీకే రుణాన్ని అందిస్తుంది.

 ఆఫర్ ఎప్పటి వరకంటే..

ఆఫర్ ఎప్పటి వరకంటే..

HDFC పండుగ తగ్గింపు ఆఫర్ నవంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే కస్టమర్ క్రెడిట్ స్కోర్ కనీసం 750 వారికి తగ్గింపు రేటుకు లోన్ పొందేందుకు అవకాశం ఉంది. జూన్ త్రైమాసికంలో గృహ రుణాల విలువ రూ.5.36 లక్షల కోట్లుగా ఉందని HDFC తెలిపింది. చివరిగా రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపుకు అనుగుణంగా కంపెనీ రేట్లను 0.50 శాతం మేర పెంచింది.

Read more about: diwali 2022 hdfc home loan bank news
English summary

Home Loan: పండుగ బొనాంజా ఆఫర్.. హోల్ లోన్ వడ్డీ రేట్లు తగ్గించిన దిగ్గజ బ్యాంక్.. | hdfc bank offering home loans at discounted interest rate for diwali 2022

hdfc bank offering home loans at discounted interest rate for diwali 2022
Story first published: Thursday, October 13, 2022, 19:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X