For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC-ఇండిగో, ఆర్బీఎల్-జొమాటో కో-బ్రాండెడ్ కార్డులతో భలే ప్రయోజనాలు

|

ఈ మధ్య కాలంలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. బ్యాంకులు వివిధ కంపెనీలతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకు వస్తున్నాయి. దీని వల్ల అటు బ్యాంకులు, ఇటు కంపెనీలు, కస్టమర్లకు ప్రయోజనాలు కలుగుతున్నాయి. అందుకే వీటి ఆదరణ పెరుగుతోంది. తాజాగా ప్రయివేట్ రంగంలోని హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు.. విమానయాన సర్వీసులు అందిస్తున్న ఇండిగో తో కలిసి కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే దాన్ని తీసుకోవడం వల్ల లాభం ఎంత వరకు ఉంటుందో ఒక నిర్ణయానికి రావచ్చు.

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు: ఢిల్లీ, హైదరాబాద్‌లో ఎంతంటేభారీగా పెరుగుతున్న బంగారం ధరలు: ఢిల్లీ, హైదరాబాద్‌లో ఎంతంటే

ఇవీ ప్రయోజనాలు

ఇవీ ప్రయోజనాలు

- కా-చింగ్ పేరుతో ఈ కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తెచ్చారు.

- ఇది తీసుకున్న వారికి కాంప్లిమెంటరీ ఎయిర్ టికెట్, లాంజ్ యాక్సెస్, ఇండిగో విమాన టికెట్ల బుకింగ్స్ పై 5 శాతం క్యాష్ బ్యాక్ లేదు రివార్డ్ పాయింట్స్, డైనింగ్, గ్రాసరీ, ఎంటర్టైన్మెంట్ వంటి వాటికి వినియోగిస్తే 3 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు.

- ఈ కార్డులో ప్రీమియం వేరియెంట్ తీసుకున్న వారికి రూ.1,500-3,000 విలువైన విమాన టికెట్లను కాంప్లిమెంటరీగా అందిస్తారు. ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తారు. వీటిని విమాన టికెట్ల బుకింగ్ సమయంలో వినియోగించుకోవచ్చు.

- డైనింగ్, షాపింగ్, ట్రాన్స్ పోర్ట్, వైద్య వ్యయాల పై 10-15 శాతం రివార్డ్స్ ను అందిస్తున్నారు.

హెచ్‌డీ‌ఎఫ్‌సి బ్యాంక్

హెచ్‌డీ‌ఎఫ్‌సి బ్యాంక్

- హెచ్‌డీ‌ఎఫ్‌సి బ్యాంక్ దేశం లో అతి పెద్ద క్రెడిట్ కార్డు జారీ బ్యాంక్ గా ఉంది. ఇప్పటి వరకు 1.4 కోట్లకు పైగా యాక్టివ్ కార్డులను కలిగి ఉంది. వచ్చే మూడేళ్ల కాలంలో 10 లక్షల కా-చింగ్ కార్డులను జారీ చేయాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్యాంకు జారీ చేసిన కార్డుల్లో దాదాపు 20 శాతం కో బ్రాండెడ్ కార్డులే ఉండటం గమనార్హం.

- ఇప్పటికే ఈ బ్యాంక్ టైమ్స్ గ్రూప్, వాల్మార్ట్ తోను టై అప్ కుదుర్చుకుంది. ఇంతకు ముందు జెట్ ఎయిర్వేస్ తో కలిసి కూడా ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును బ్యాంక్ తెచ్చింది.

- ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా జరుగుతున్న ఖర్చుల్లో ప్రయాణ, ఆతిథ్య విభాగాల వాటాయే 12-13 శాతం గా ఉంది.

ఆర్బీఎల్-జొమాటో కార్డు

ఆర్బీఎల్-జొమాటో కార్డు

ప్రయివేట్ రంగంలోని ఆర్బీఎల్ , ఆహార డెలివెరీ రంగంలోని జొమాటోలు కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తెచ్చాయి. ఈ కార్డు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఎడిషన్, ఎడిషన్ క్లాసిక్. వీటి ద్వారా జొమాటో గోల్డ్ మెంబర్షిప్, క్యాష్ బ్యాకులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలను కల్పిస్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో వినియోగించిన ప్రతి సారి కూడా జొమాటో క్రెడిట్స్ లభిస్తాయి. జొమాటో యాప్ లేదా రెస్టారెంట్లలో వినియోగించినప్పుడు రివార్డ్స్ పొందుతారు. ఈ కార్డు ద్వారా తమ వ్యాపారాల్లో మంచి వృద్ధి ఉంటుందని, కస్టమర్లకు ప్రయోజనం లభిస్తుందని రెండు సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆర్బీఎల్ కు 25 లక్షలకు పైగా క్రెడిట్ కార్డు కస్టమర్లు ఉన్నారు. యువత జీవన విధానం మారిపోతోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది తమకు నచ్చిన ఆహారాన్ని ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా తెచ్చిన ఎడిషన్ కార్డులు కస్టమర్లకు ప్రయోజనం అందిస్తాయని ఈ సంస్థలు భావిస్తున్నాయి.

English summary

HDFC-ఇండిగో, ఆర్బీఎల్-జొమాటో కో-బ్రాండెడ్ కార్డులతో భలే ప్రయోజనాలు | HDFC Bank-Indigo, RBL-Zomato launches co-branded credit cards

To expand their customer base HDFC Bank and airline company Indigo launched co-branded credit card. RBL-Zomato also partnered for the co-branded credit card.
Story first published: Tuesday, March 3, 2020, 20:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X