For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC బ్యాంకుకు అమెరికా లా-కంపెనీ భారీ షాక్, ఎందుకంటే

|

HDFC బ్యాంకుకు భారీ షాక్ తగిలింది. అమెరికాకు చెందిన లా-ఫర్మ్ రోసన్‌లా కంపెనీ ఈ బ్యాంకుపై క్లాస్ యాక్షన్ దావా వేయనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ పెట్టుబడిదారు హక్కులకు చెందినది. ఈ బ్యాంకు వాటాదారుల తరఫున పొటెన్షియల్ సెక్యూరిటీ క్లెయిమ్స్‌కు సంబంధించి విచారణను ప్రారంభిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు వాటాదారుల తరఫున సెక్యూరిటీస్ వ్యాజ్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు రోసెన్‌లా సంస్థ ఆదివారం రాత్రి విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఆ వివరాలు ఇవ్వడంలో జాప్యం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై ఆర్బీఐకి ఫిర్యాదు!ఆ వివరాలు ఇవ్వడంలో జాప్యం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై ఆర్బీఐకి ఫిర్యాదు!

వాటాదారులకు విజ్ఞప్తి

వాటాదారులకు విజ్ఞప్తి

వాస్తవాలు దాచిపెట్టినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దర్యాఫ్తునకు ఆదేశించినట్లు రోసన్‌లా కంపెనీ తెలిపింది. ఈ బ్యాంకు సెక్యూరిటీస్ కొనుగోలు చేసిన వాటాదారులు కూడా దీనికి మద్దతు పలకాలని కోరింది. తమ ఫిర్యాదును నమోదు చేయాల్సిందిగా ఒక వెబ్‌సైట్ సమాచారాన్ని అందించింది. వెహికిల్ ఫైనాన్సింగ్ విభాగంలో అక్రమ రుణపద్ధతులకు సంబంధించి దర్యాఫ్తు జరిపినట్లు నెల రోజుల క్రితం బ్యాంకు నివేదించింది. ఈ సమయంలో తాజా పరిమాణం చోటు చేసుకుంది. వెహికిల్ ట్రాకింగ్ పరికరాల్ని కొనుగోలు చేయమని కారు లోన్ కస్టమర్లను బలవంతం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి బ్యాంకు పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకుంది.

బ్యాంకు ఉద్యోగులపై చర్యలు..

బ్యాంకు ఉద్యోగులపై చర్యలు..

వెహికిల్ లోన్ టార్గెట్ చేరుకునేందుకు తప్పుడువిధానాలు అవలంభించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాఫ్తు జరిపిన బ్యాంకు ఆరుగురు సీనియర్, మధ్యస్థాయి ఉద్యోగులను తొలగించింది. దీనిపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎక్స్‌పీరియన్ కూడా ఆర్బీఐకి గత నెలలో ఫిర్యాదు చేసింది. బ్యాంకు నుండి లోన్ తీసుకున్న లక్షలమంది కస్టమర్ల వివరాలతో పాటు వారి పేమెంట్ హిస్టరీ కూడా ఆలస్యంగా ఇస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు, వాటాదారులకు రక్షణగా నిలిచే సంస్థగా రోసన్-లా దావా సంచలనంగా మారింది. బ్యాంకు సెక్యూరిటీస్‌లలో తమ నష్టాలను తిరిగి పొందాలని చూస్తున్న బ్యాంకు షేర్ హోల్డర్స్ నుండి లా-ఫర్మ్ సమాచారం కోరింది.

పడిపోయిన షేర్లు

పడిపోయిన షేర్లు

ఈ విషయం వెలుగు చూడటంతో HDFC బ్యాంకు అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్ ప్రైస్ 1.37 డాలర్లు లేదా 2.83 శాతం డాలర్లు క్షీణించి 47.02 డాలర్ల వద్ద ముగిసింది. నేడు (ఆగస్ట్ 17, సోమవారం) స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 1.56 సమయానికి బ్యాంకు షేర్లు 0.68 శాతం క్షీణించాయి.

కారు లోన్, కస్టమర్లకు జీపీఎస్ షాక్: ఆరుగురు ఉద్యోగుల్ని తొలగించిన హెచ్‌డీఎఫ్‌సీకారు లోన్, కస్టమర్లకు జీపీఎస్ షాక్: ఆరుగురు ఉద్యోగుల్ని తొలగించిన హెచ్‌డీఎఫ్‌సీ

English summary

HDFC బ్యాంకుకు అమెరికా లా-కంపెనీ భారీ షాక్, ఎందుకంటే | HDFC Bank faces lawsuit from US based Rosen law firms

US based Rosen Law Firm has announced an investigation of potential securities claims on behalf of shareholders of HDFC Bank Ltd following allegations that the bank may have issued materially misleading business information to investors.
Story first published: Monday, August 17, 2020, 14:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X