For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFCపై కరోనా ప్రభావం కొంతే: మీ ఉద్యోగాలు పోవు, వేతనాల పెంపు, బోనస్‌లు ఉంటాయి

|

HDFC బ్యాంకు ఉద్యోగులకు ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్(MD), CEO ఆదిత్య పురి భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రంగాల్లో, కంపెనీల్లో ఉద్యోగాల కోత, వేతన కోత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదిత్య పురి తమ బ్యాంకు ఉద్యోగుల్లో ధీమా కల్పించారు. మీ ఉద్యోగులు పోవని, ఇంక్రిమెంట్స్, బోనస్‌లకు కూడా ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు. దేశంలో అతిపెద్ద ప్రయివేటు రంగ HDFC బ్యాంకులో 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మీ ఉద్యోగాలు, వేతన పెంపు, బోనస్ ఎక్కడికీ పోవని, తాను బ్యాంకు, తన అనంతరం బాధ్యతలు చేపట్టనున్న శశిధర్ జగదీషన్ తరఫున హామీ ఇస్తున్నానని చెప్పారు.

పండుగ చేసుకో! కస్టమర్లకు HDFC అదిరిపోయే ఆఫర్లు, రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్పండుగ చేసుకో! కస్టమర్లకు HDFC అదిరిపోయే ఆఫర్లు, రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్

బ్యాంకు పనితీరు బాగుంది

బ్యాంకు పనితీరు బాగుంది

ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లోను బ్యాంకు పనితీరు బాగుందని, ఉద్యోగాలు, బోనస్‌కు ఎలాంటి ఇబ్బందిలేదని, ఉద్యోగులకు ఆదిత్యాపురి భరోసా ఇచ్చారు. ఆయన ఈ నెల ఆఖరులో పదవీ విరమణ పొందుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకులో పని చేస్తోన్న 1.15 లక్షలకు పైగా ఉద్యోగులను ఉద్దేశించి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బ్యాంకు వద్ద మూలధన నిల్వలు కావాల్సినన్ని ఉన్నాయన్నారు. రుణాలపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో మంచి ఫలితాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. 'మీ ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీలేదు. జీతాల పెంపు కూడా ఉంటుంది. బోనస్, ప్రమోషన్లకూ ఢోకా లేదు' అని వీడియో సందేశంలో ధైర్యం చెప్పారు.

కలిసి పని చేయాలి

కలిసి పని చేయాలి

బ్యాంకు ప్రారంభం నుంచి ఆదిత్యపురి పని చేస్తున్నారు. బ్యాంకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంలో మీ వంతు పాత్ర పోషించేలా, పోటీని తట్టుకొని నిలబడేలా ఓ బృందంగా మీరంతా (ఉద్యోగులు) పని చేయాలని వీడియో సందేశంలో ఆయన సూచించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో క్లోజ్ కావడంతో వ్యవస్థీకృత రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. లాక్ డౌన్ సమయంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో వ్యాపారాలు లేకుండా పోయాయి. కానీ ఎక్కువ శాతం బ్యాంకులు ఉద్యోగులకు వేతనాలు, బోనస్‌లు ఇవ్వడంతో పాటు భరోసా కూడా ఇస్తున్నాయి.

ఇబ్బంది పెట్టినప్పటికీ..

ఇబ్బంది పెట్టినప్పటికీ..

కరోనా మహమ్మారి పరిమాణాలు బ్యాంకును కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ, బ్యాంకు పని తీరు మెరుగ్గా ఉందని ఆదిత్యపురి అన్నారు. ఇప్పుడు బ్యాంకు పోర్ట్‌పోలియోలు ఎలాంటి ఒత్తిడిలో లేవన్నారు. పంపిణీ, టెక్నాలజీ ప్రయోజనాలను వేగంగా అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు. పండుగ ఆఫర్ల గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలన్నారు.

English summary

HDFCపై కరోనా ప్రభావం కొంతే: మీ ఉద్యోగాలు పోవు, వేతనాల పెంపు, బోనస్‌లు ఉంటాయి | HDFC Bank employees jobs, increments, bonuses are secure: Aditya Puri

HDFC Bank Managing Director and Chief Executive Officer Aditya Puri has assured employees of the country's largest private sector lender that their jobs and bonuses are secure.
Story first published: Wednesday, October 7, 2020, 10:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X