For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HCL Tech: సంతోషంలో హెచ్‌సీఎల్‌ ఉద్యోగులు.. రోషిణి నాడార్‌ ఇచ్చిన అప్ డేట్ ఏంటంటే..?

|

HCL Tech: ప్రస్తుతం ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం లక్షల్లో జీతాలు పొందుతున్న వారిని సైతం వేధిస్తోంది. ఈ క్రమంలో ఖర్చులు పెరిగినంత వేగంగా జీతాలు మాత్రం పెరగటం లేదు. దీంతో అదనపు ఆదాయం కోసం టెక్కీలు పక్కచూపులు చూస్తున్న విషయం తెలిసిందే. దీనిని మూన్ లైటింగ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది కొన్ని నెలల కిందట పెద్ద వివాదంగా మారి ఆ రంగాన్నే కుదిపేసింది.

వ్యతిరేకించిన కంపెనీలు..

వ్యతిరేకించిన కంపెనీలు..

మూన్ లైటింగ్ అనేది తమ పాలసీలకు విరుద్ధమని కొన్ని కంపెనీలు చెప్పగా, మరికొన్ని మాత్రం ఇది నైతికతకు సంబంధించినదంటూ కామెంట్ చేశాయి. అయితే చాలా తక్కువ సంఖ్యలో ఐటీ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు రెండు ఉద్యోగాల సిద్ధాతాన్ని సమర్థించాయి. ఈ వివాదంలో చాలా మంది ఉద్యోగాలను కూడా కోల్పోయారు. రెండు ఉద్యోగాలు చేస్తున్న వారిని కంపెనీలు గుర్తించి తొలగించటం పెద్ద సంచలనాన్నే సృష్టించింది.

హెచ్‌సీఎల్‌ అధినేత్రి..

హెచ్‌సీఎల్‌ అధినేత్రి..

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ ఐటీ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటి. దీనికి Roshini Nadar సారధ్యం వహిస్తున్నారు. ఆమె నాయకత్వంలో కంపెనీ ఇటీవల మూడో త్రైమాసికంలో మంచి లాభాలను సైతం నమోదు చేసింది. అయితే ఆమె తాజాగా ఇండియా టుడే కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మూన్ లైటింగ్ ప్రస్తుతం పెద్ద సమస్య కాదని కామెంట్ చేశారు. దీన్ని చాలా సీరీయస్ గా తీసుకున్నామన్న రోషిణి.. కానీ తమ కంపెనీకి ఇది పెద్ద సమస్య కాదని అన్నారు.

ఉద్యోగుల పనితీరు..

ఉద్యోగుల పనితీరు..

కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మంది ప్రస్తుతం ఇంటి వద్ద నుంచి పని చేస్తున్నారు. వారి పనితీరు, ఉత్పాదకతకు సంబంధించి రికార్డులు తమవద్ద ఉన్నాయని రోషిణి వెల్లడించారు. వర్చువల్ మోడల్ వర్క్‌ను మెుదట అంగీకరించింది తామేనని ఆమె వెల్లడించారు. దేశంలోని 32-35 నగరాల నుంచి 1000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

తిరిగి ఆఫీసులకు..

తిరిగి ఆఫీసులకు..

ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాలని పిలిచినప్పుడు అధిక ఖర్చుల భారాన్ని వారు మోయాల్సి వస్తున్నట్లు గుర్తించినట్లు రోషిణి నాడార్ అన్నారు. మరీ ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులతో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో చాలా కంపెనీలు రెండవ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆ వివరాలను ముందుగానే వెల్లడించాలంటున్నాయి. తమ మేనేజర్ల వద్ద వాటికి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలని చెబుతున్నారు. అసలు ఈ వివాదం విప్రో అధినేత రిషద్ ప్రేమ్‌జీ మూన్ లైటింగ్ పై కామెంట్స్ చేయటం, ఉద్యోగులను తొలగించటంతో ప్రారంభమైంది.

మాంద్యంలోనూ మెరుగ్గా..

మాంద్యంలోనూ మెరుగ్గా..

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలు ఆందోళన చెందుతోంది ముఖ్యంగా మాంద్యం గురించే. ఈ క్రమంలో చాలా ఐటీ సేవల కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అయితే ఈ క్రమంలోనూ మూడో త్రైమాసిక ఫలితాలను అన్వేషిస్తే హెచ్సీఎల్ మెరుగైన పనితీరును కనబరిచింది. అయితే మాంద్యం ఎంత పెద్దదిగా మారుతుందనే భయాలు మాత్రం ఐటీ రంగంలోని అన్ని కంపెనీలనూ వేధిస్తూనే ఉంది.

English summary

HCL Tech: సంతోషంలో హెచ్‌సీఎల్‌ ఉద్యోగులు.. రోషిణి నాడార్‌ ఇచ్చిన అప్ డేట్ ఏంటంటే..? | HCL Techologies roshini nadar commented moonlighting is not problem to company

HCL Techologies roshini nadar commented moonlighting is not problem to company
Story first published: Friday, January 20, 2023, 12:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X