For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HCL Technologies: రూ. 10 డివిడెండ్ ప్రకటించిన హెచ్‍సీఎల్ టెక్నాలజీ.. నిరాశపరిచిన విప్రో..

|

ఐటీ కంపెనీ హెచ్ సీఎల్ టెక్నాలజీ బుధవారం క్యూ2 ఫలితాలు విడుదల చేసింది. కంపెనీ వార్షిక ప్రాతిపదికన 6% జంప్ చేసి రూ.3,259 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో HCL టెక్ ఏకీకృత ఆదాయం రూ. 20,655 కోట్ల నుంచి 5.2% పెరిగి రూ.24,686 కోట్లకు చేరుకుంది. కంపెనీషేర్‌హోల్డర్‌లకు ఒక్కో షేరుకు రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ కూడా ప్రకటించింది.

రూ.10

రూ.10

మధ్యంతర డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డు తేదీ 20 అక్టోబర్, 2022న నిర్ణయించారు. " మధ్యంతర డివిడెండ్ చెల్లింపు తేదీ నవంబర్ 2, 2022గా ఉంటుంది" అని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అంచనా వేసిన 12-14%తో పోలిస్తే స్థిరమైన కరెన్సీలో హెచ్‌సీఎల్ టెక్ ఇప్పుడు 13.5-14.5% వృద్ధిని సాధించింది.

అట్రిషన్

అట్రిషన్

ఈ త్రైమాసికంలో హెచ్ సీఎల్ కొత్తగా 10,339 మంది ఫ్రెషర్లను చేర్చుకుంది. ఈ త్రైమాసికంలో నికరంగా 8,359 మంది ఉద్యోగులు చేరారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. HCL టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 219,325గా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్ లో వివరించింది. కంపెనీ అట్రిషన్ 23.8 శాతంగా ఉందని వివరించింది.

డిజిటల్-ఫస్ట్

డిజిటల్-ఫస్ట్

మా కొత్త బ్రాండ్ గుర్తింపు మా గో-టో మార్కెట్ వ్యూహం, అమలు సామర్థ్యాలపై రేజర్-షార్ప్ ఫోకస్‌ని తీసుకువస్తుందని

హెచ్‌సిఎల్ టెక్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా చెప్పారు. మా విభిన్నమైన పోర్ట్‌ఫోలియోతో, డిజిటల్-ఫస్ట్ వరల్డ్‌లో ముందున్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి మేము మంచి స్థానంలో ఉన్నామని తెలిపారు.

విప్రో

విప్రో

మరో కంపెనీ విప్రో కూడా క్యూ2 ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఏకీకృత నికర లాభాలలో 9.27 శాతం తగ్గుదల

నమోదు చేసింది. బెంగళూరుకు చెందిన సంస్థక నికర లాభం అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో రూ. 2,930.7 కోట్ల నుండి రూ. 2,659 కోట్లుగా ఉంది.

English summary

HCL Technologies: రూ. 10 డివిడెండ్ ప్రకటించిన హెచ్‍సీఎల్ టెక్నాలజీ.. నిరాశపరిచిన విప్రో.. | HCL Technologies And Wipro announced Q2 Result on Wednesday

HCL Technologies announced Q2 Result on Wednesday. The company reported a profit of Rs. 3,259 crore in the same period last year. Wipro Also Announced Q2 Result on Wednesday
Story first published: Thursday, October 13, 2022, 10:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X