For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిప్టో కరెన్సీపై మరోసారి స్పందించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం క్రిప్టో కరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి క్రిప్టో కరెన్సీ పైన తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 'క్రిప్టో కరెన్సీ ఆర్థిక స్థిరత్వంపై తమకు తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. ఇదే విషయాన్ని తాము భారత ప్రభుత్వానికి తెలియజేశాము.' అని ఓ కార్యక్రమంలో శక్తికాంత దాస్ అన్నారు. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోను ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తమ ఆందోళనలు కేంద్రం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో జూన్ 4న కూడా క్రిప్టోపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, వివిధ క్రిప్టో కరెన్సీలు నేడు మరోసారి నష్టపోయాయి. కార్డానో గత వారం రోజుల్లో 18 శాతం నష్టపోయింది. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ 2 శాతం కంటే ఎక్కువ పతనమైంది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం 2.09 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. గత 24 గంటల్లో 0.64 శాతం క్షీణించింది. బిట్ కాయిన్ 64,000 డాలర్లకు పైన ట్రేడ్ అవుతోంది. రెండో క్రిప్టో దిగ్గజం ఎథేరియం 0.66 శాతం నష్టపోయింది. ఉదయం మాత్రం స్వల్పంగా లాభపడింది. గత వారం రోజుల్లో బిట్ కాయిన్, ఎథేరియం.. రెండు కూడా ఏడు శాతం మేర నష్టపోయాయి. బిట్ కాయిన్ నిన్న ఓ సమయంలో 45,000కు పడిపోయింది. ఎథేర్ 15 శాతం క్షీణించింది.

Have serious concerns on crypto: RBI Governor Shaktikanta Das

బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. గత నెల రోజులుకు పైగా 40వేల డాలర్లు దాటి, ఇటీవలే 50వేల డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం 51,000 మార్కు దాటిన బిట్ కాయిన్ త్వరలోనే 55,000 దిశగా కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నప్పటికీ, రెండు రోజులుగా భారీగా పతనమవుతోంది. సోలానా మాత్రం ఏకంగా 21.67 శాతం లాభపడింది.

- Bitcoin BTC - $46,006.32 - 1.03 శాతం డౌన్

- Ethereum ETH - $3,471.33 - 1.14 శాతం జంప్

- Cardano ADA - $2.43 - 2.43 శాతం డౌన్

- Binance Coin BNB - $408.54 - 1.55 శాతం డౌన్

- Tether USDT - $1.00 - 0.04 శాతం డౌన్

- XRP - $1.09 - $1.45 శాతం డౌన్

- Dogecoin - $0.25 - $1.59 శాతం డౌన్

- Polkadot DOT - $27.73 - 0.91 శాతం డౌన్

- USD Coin USDC - $1.00 - 0.03 శాతం జంప్

- Solana SOL - $211.55 - $21.67 శాతం జంప్

English summary

క్రిప్టో కరెన్సీపై మరోసారి స్పందించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ | Have serious concerns on crypto: RBI Governor Shaktikanta Das

RBI Governor Shaktikanta Das on 9 September said the central bank has serious concerns on cryptocurrency with respect to financial stability.
Story first published: Thursday, September 9, 2021, 22:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X