For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Microsoft: అమెజాన్, కాగ్నిజెంట్ ఆఫర్లను వద్దని.. మైక్రోసాఫ్ట్ లో భారీ ప్యాకేజ్ కొట్టి.. ఎక్కడంటే..

|

Madhur Rakheja: మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు పొందటం యువతకు పెద్ద కల. ఇది విద్యార్థులకే కాక వారి తల్లిదండ్రులకు సైతం గర్వంగా భావిస్తున్నారు. ఇలాంటి కథే ఒకటి హర్యానాలో జరిగింది. హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్‌కు చెందిన బీటెక్ విద్యార్థి మధుర్ రఖేజాదీ ఇదే కథ ఇది. మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ఇతనికి రూ.50 లక్షల జాబ్ ఆఫర్ వచ్చింది. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ జాబ్ ఆఫర్ రాకముందే అతడు అమెజాన్, కాగ్నిజెంట్ వంటి కంపెనీల ఆఫర్లను తిరస్కరించాడు.

చిన్న దుకాణం నడుపుతున్న తండ్రి..

చిన్న దుకాణం నడుపుతున్న తండ్రి..

మధుర్ రఖేజా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. అతను UPES స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్‌లో స్పెషలైజేషన్‌తో పూర్తి చేశాడు. ఈయన తండ్రి చిన్న దుకాణం నడుపుతుండగా.. తల్లి గృహిణి.

ఈ కోర్సులో డిగ్రీ ఎందుకు..

ఈ కోర్సులో డిగ్రీ ఎందుకు..

తనకు టెక్నాలజీపై మక్కువ ఉందని.. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జీవితాలను చేసే శక్తి దానికి ఉందని అతను అన్నాడు. అప్‌స్ట్రీమ్ పెట్రోలియం ఇంజినీరింగ్‌కు వెళ్లమని తనను ఎవరో సూచించారని చెప్పాడు. కానీ అతను దానిలో వృత్తి గురించి ఖచ్చితంగా తెలియదని అన్నాడు. 'కంప్యూటర్ సైన్స్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్ స్పెషలైజేషన్ కూడా ఉందని అప్పుడు తెలిసింది' అని చెప్పాడు. ఈ ప్లేస్‌మెంట్ సెషన్‌లో UPES తమకు చాలా మంచి అవకాశాలను అందించిందని వెల్లడించాడు. అలా క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా మైక్రోసాఫ్ట్ నుంచి భారీ ప్యాకేజీని కొట్టేశాడు.

 ఇతర కంపెనీలను తిరస్కరించి..

ఇతర కంపెనీలను తిరస్కరించి..

మైక్రోసాఫ్ట్ కాకుండా మాధుర్ కు.. డిఇ షా, ఆప్టమ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మొదలైన అనేక కంపెనీలకు క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రెండింటినీ దరఖాస్తు చేసుకున్నాడు. వాటిలో మైక్రోసాఫ్ట్, ఆప్టమ్, కాగ్నిజెంట్, అమెజాన్ నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ మెక్రోసాఫ్ట్ ను ఎంచుకున్నాడు.

 ఎందుకు Microsoft ఎంచుకున్నాడంటే..

ఎందుకు Microsoft ఎంచుకున్నాడంటే..

తన నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉన్నాయని రాఖేజా చెప్పాడు. మైక్రోసాఫ్ట్‌లో పని గంటలు అనువుగా ఉంటాయి. అక్కడ వర్క్ కల్చర్ చాలా బాగుంది. అక్కడ ఇంజనీర్లు చేసే పని చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కంపెనీ తన ఉద్యోగుల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది. మైక్రోసాఫ్ట్‌లోని ఉద్యోగులు తమ హాబీలు, ఆసక్తులను సులభంగా కొనసాగించవచ్చని తెలిపాడు.

English summary

Microsoft: అమెజాన్, కాగ్నిజెంట్ ఆఫర్లను వద్దని.. మైక్రోసాఫ్ట్ లో భారీ ప్యాకేజ్ కొట్టి.. ఎక్కడంటే.. | haryana techie Madhur Rakheja rejected amazon, cognizant offers for microsoft job know details

haryana techie Madhur Rakheja rejected amazon, cognizant offers for microsoft
Story first published: Wednesday, August 3, 2022, 15:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X