మీ భార్యను చూస్తూ కూర్చోమని నేను చెప్పడం లేదు.. నవ్వులు పూయిస్తున్న హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పిజి గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఆ మధ్య భార్యమీద పని మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే. తాజాగా ఈ టెక్ ఐకూన్ ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన గ్రూప్ ఉద్యోగులతో మాట్లాడిన అంశాలు తాజాగా వైరల్‌గా అయ్యాయి తన వేసిన డైలాగులు చమత్కారంతో ఉద్యోగుల ముఖాల్లో నవ్వులు విరిచాయి. ఇంతకు ముందు మాట్లాడిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నేను ఆదివారాలు పనిచేయడం గురించి, భార్యల వైపు చూస్తూ కూర్చోవడం గురించి మాట్లాడటం లేదని ఆయన మాట్లాడుతుంటే ఉద్యోగులంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు.
ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. మీ చమత్కారంతో ప్రతి ఉద్యోగి ముఖంలో నవ్వులు చిందించారు. మీ సంస్థలో సిబ్బంది.. పనిలో సంతృప్తితో ఉన్నారని నా అభిప్రాయమని ఒకరు కామెంట్ పెట్టారు. కాగా ఎల్ అండ్ టి అనే కంపెనీ చైర్మన్ చివరిసారిగా టౌన్ హాల్ లో మాట్లాడినప్పుడు చాలా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆదివారం పని చేయడం గురించి నేను మాట్లాడలేదు. మీ జీవిత భాగస్వాములను చూడటం గురించి నేను మాట్లాడలేదు, కాబట్టి దయచేసి..." అంటూ గోయెంకా టౌన్ హాల్ లో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసగించిన వ్యాఖ్యలు ఉద్యోగుల ముఖాల్లో నవ్వులు పూయించాయి.వారు చప్పట్ల మధ్య ఆయన ప్రసంగించారు.

ఇదిలా ఉంటే వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారం సెలవునూ వదిలేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యం గతంలో చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో దుమారాన్నే లేపాయి. ఆదివారాలు మీతో నేను పని చేయించలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. మీతో అలా పని చేయించగలిగితేనే నాకు చాలాసంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నాను. ఇంట్లో కూర్చుని మీరు ఏం చేస్తారు.
ఎంతకాలం మీరు అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యలకు చెప్పాలని ఉద్యోగులనుద్దేశించి హర్ష్ గోయెంకా మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రేగిన సంగతి విదితమే. ఈ వివాదాస్పద అంశంపై అంశంపై హర్ష్ గోయెంకా గతంలోనూ స్పందించారు.
వారానికి 90 గంటల పనా? సండేను సన్-డ్యూటీ అని..రోజువారి పనిని 'ఊహాజనిత భావన' అని ఎందుకు మార్చకూడదని ఆర్‌పిజి గ్రూప్ చైర్మన్ అన్నారు. ఎవరైనా కష్టపడి తెలివిగా పని చేయడంపై నాకు నమ్మకం ఉంది. కానీ, జీవితాన్ని శాశ్వతమైన ఆఫీసు షిప్టుగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయాన్ని తీసుకురాదన్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు. అది ఓ అవసరం అని నా అభిప్రాయం'' అని ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. 'వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్' అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా దీనికి జత చేశారు.
మీరు స్వయంగా మాట్లాడటం వినడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. X లో మీ సందేశాలు, రచనలు ఎల్లప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి, మీ ప్రసంగం ముగింపు భాగం కూడా చాలా హాస్యభరితంగా ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఒక విజయవంతమైన వ్యవస్థాపకుడు కావాలంటే గొప్ప హాస్యం ఉండాలి సర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఇదిలా ఉంటే L&T చైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ వారానికి 90 గంటల పని కోసం మాట్లాడుతూ.. తన ఉద్యోగులను ఆదివారాల్లో పని చేయించలేకపోవడం పట్ల చింతిస్తున్నానని అన్నారు. మీరు ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? మీ భార్యను ఎంతసేపు తదేకంగా చూడగలరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.