For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..

|

h1b layoffs: టెక్ కంపెనీలు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నాయి. వరుస లేఆఫ్ లతో బెంబేలెత్తిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం దృష్ట్యా.. ఉద్యోగాల్లో కోత విధించక తప్పదని ఆయా సంస్థలు చెబుతున్నాయి. అయితే ఉద్యోగం కోల్పోయిన సిబ్బంది ట్విట్టర్, లింక్డ్‌ ఇన్ వంటి సామాజిక మాధ్యమాల్లో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా ఓ ఉద్యోగి ఉదంతం ట్విట్టర్ లో చక్కర్లు కొడుతోంది.

ఇదో వెరైటీ బాధ

ఇదో వెరైటీ బాధ

జాబ్‌ లో చేరిన నెలకే ఉద్యోగం కోల్పోవడం, భార్యాభర్తలు ఇరువురినీ తొలగించడం, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లిన రెండు నెలలకే లేఆఫ్, ఉద్యోగిని రిక్రూట్ చేస్తున్న HRకి జాబ్ కట్.. ఈ తరహా వార్తలు ఇప్పటికే విన్నాం. ఈ లిస్టులోకి మరోటి వచ్చి చేరింది. సెలవులో ఉన్న US వలస ఉద్యోగిని అతని కంపెనీ తొలిగించింది. H1B వీసా మీద అతను పనిచేస్తుండగా.. ఇప్పుడు తిరిగి USలో ప్రవేశించే అవకాశం లేకుండా పోయింది.

ఆస్తులు అమ్ముకునే అవకాశమూ లేదు

ఆస్తులు అమ్ముకునే అవకాశమూ లేదు

H1B వీసాపై అమెరికాలో పనిచేస్తున్న టెక్కీ, వేరే దేశంలో ఉన్నప్పుడు ఉద్యోగం కోల్పోయాడు. తిరిగి USలో అడుగు పెట్టే అవకాశం లేకపోవడంతో.. కారు, ఇతర వస్తువులను విక్రయించేందుకు స్థానికంగా ఉన్న స్నేహితుడిని సంప్రదించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఆ ఫ్రెండ్ ట్వీట్ చేయడంతో ఇప్పుడిది వైరల్ గా మారింది. టూరిస్ట్ వీసా తీసుకుని అక్కడి పనులు చక్కబెట్టుకుని, ఫ్లాట్ ఖాళీచేయమని కొందరు సలహా ఇస్తున్నారు.

ఇవీ నిబంధనలు

ఇవీ నిబంధనలు

H1B వీసాదారులు ఉద్యోగం కోల్పోతే తిరిగి 60 రోజుల్లో మరో ఉపాధి వెతుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణంగా అప్పిటికే US వెలుపల ఉన్నట్లయితే, తిరిగి అమెరికాలో ప్రవేశించేందుకు ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అంగీకరించవు. ఎందుకంటే H1B అనేది కంపెనీ స్పాన్సర్ చేసే వీసా. ఈ తరహా చట్టాల వల్ల విదేశాల్లో, అందులో ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన టెక్కీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

English summary

h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక.. | H1B Techie laid off while in vacation outside us

H1B Techie job loss while in vacation..
Story first published: Thursday, February 2, 2023, 18:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X