For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో జీఎస్టీ చెల్లింపుల గడువు పెంపు!

|

కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ చెల్లింపుల విధానంలో కొన్ని మార్పులు చేసింది. ముఖ్యంగా ప్రతి నెల జీఎస్టీ చెల్లింపులు చేసే కంపెనీలకు ఇచ్చే గడువును సవరించింది. దీంతో దేశవ్యాప్తంగా జీఎస్టీ చెల్లింపులకు మూడు ప్రత్యేక తేదీలను కేటాయించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా... ఇంకా బాలారిష్టాలు తీరలేదు. ఒకవైపు సంక్లిష్టమైన విధానాలు, మరోవైపు ఆర్థిక మందగమనంతో దెబ్బతింటున్న బిజినెస్ లు. ఈ నేపథ్యంలో ప్రతి నెల జీఎస్టీ కలెక్షన్లు తీసికట్టుగా మారుతున్నాయి.

ఆసియా దేశాల్లో రూపాయి అత్యంత చెత్త ప్రదర్శన! పాక్ రుపీ, బంగ్లా టాకా పరిస్థితి ఇదీ..

నెలకు రూ 1 లక్ష కోట్ల పన్ను వసూలు కావటం కూడా కష్టంగా మారిపోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం విధించుకున్న లక్యం రూ 13 లక్షల కోట్లు కాగా.. ఇప్పటి వరకు లక్ష్యాన్ని చేరుకోనేలేదు. 11 ఏళ్లలోనే కనిష్ఠానికి పడిపోయిన దేశ జీడీపీ వృద్ధి నేపథ్యంలో ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోనీ పరిస్థితి. అయినప్పటికీ, జీఎస్టీ అధికారులపై అలవికాని లక్ష్యాలను పెడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితిలోనూ నెలకు రూ 1.25 లక్షల కోట్ల పన్నులు వసూలు చేయాలనీ అధికారులకు టార్గెట్ నిర్దేశించారు. దానికి అనుగుణంగా ఈ మధ్య జీఎస్టీ దాడుల సంఖ్య పెరిగింది. కంపెనీలు, సెలెబ్రిటీలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.

చెల్లింపులు సులభతరం...

చెల్లింపులు సులభతరం...

జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహిస్తూ, పన్ను ఎగవేతదారులపై కేసులు నమోదు చేస్తుండటంతో కొంత పన్ను వసూళ్లు పెరుగుతున్నాయి. కానీ దేశమంతా చెల్లింపుల చివరి తేదీ ఒకటే ఉండటంతో నెట్వర్క్ పై అధిక లోడ్ పడుతోంది. వ్యాపారులు అందరూ చివరి తేదీ వరకు వేచి చూసి, రిటర్న్స్ వేయటానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో నెట్వర్క్ సరిగ్గా పనిచేయటం లేదు. గడువు చివరి రోజు రిటర్న్స్ దాఖలు చేయలేక పోతే వ్యాపారులు, కంపెనీలకు జరిమానాలు పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని నెలవారీగా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసే కంపెనీలకు కొంత ఊరట కల్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ భావించింది. ఈ మేరకు దేశాన్ని మూడు విభాగాలుగా చేసి, మూడు వేర్వేరు తేదీలను గడువు తేదీలుగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనాన్ని ప్రచురించింది.

తెలుగు రాష్ట్రాలకు 2 రోజులు అధికం...

తెలుగు రాష్ట్రాలకు 2 రోజులు అధికం...

ఈ ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం జీఎస్టీ నెట్వర్క్ సేవలు అందిస్తున్న ఇన్ఫోసిస్ ని ప్రభుత్వం కొత్త విధానానికి తమ సాఫ్ట్ వేర్ ను సవరించాలని కోరింది. రూ 5 కోట్లు అంతకంటే అధిక టర్నోవర్ కలిగిన కంపెనీలకు జీఎస్టీ ఆర్ - 3 బీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు తేదీని ప్రతి నెల 20గా నిర్ణయించింది. ఇప్పటి వరకు అన్ని కంపెనీలకూ ఇదే గడువు తేదీగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం టర్నోవర్ అధికంగా ఉన్న కంపెనీలను విభజించే సరికి కేవలం 8 లక్షల కంపెనీలు మాత్రమే ప్రతి నెల 20వ తేదీన తమ రిటర్న్స్ ను తప్పనిసరిగా దాఖలు చేయాలి. మరో వైపు రూ 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన కంపెనీలు, సంస్థలను రెండు కేటగిరి లుగా విభజించారు. అందులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, డామన్-డియూ, దాద్రా-నగర్ హవేలీ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, లక్షద్వీప్, కేరళ, తమిళ నాడు, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఒక కేటగిరిలో ఉన్నాయి. వీటికి గడువు తేదీని ప్రతి నెల 22కు పెంచారు. అంటే మునుపటి కంటే 2 రోజులు అధిక సమయం ఉంటుంది. ఈ విభాగంలో 49 లక్షల మంది జీఎస్టీ చెల్లింపుదారులు ఉన్నారు.

రెండో కేటగిరికి 24 వరకు..

రెండో కేటగిరికి 24 వరకు..

రూ 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన సంస్థలు, కంపెనీల రెండో కేటగిరిలో జమ్మూ-కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగర్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. జీఎస్టీ రిటర్న్స్ కు గడువు తేదీని ప్రతి నెల 24 వ తేదీగా నిర్ణయించారు. ఈ విభాగంలో దాదాపు 46 లక్షల మంది జీఎస్టీ చెల్లింపుదారులు ఉన్నారు. దీంతో, ఇటు జీఎస్టీ చెల్లింపుదారులకు కొంత ఊరట లభించినట్లు అవుతుంది, అటు జీఎస్టీ నెట్వర్క్ పైన కొంత లోడ్ తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. చూడాలి మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఆశిస్తున్నట్లు జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయో లేదో!

English summary

GST returns can now be filed in a staggered manner

In a moved aimed at de-stressing the GST system, the finance ministry on Wednesday staggered last dates of filling GSTR-3B, a monthly return form, and has provided three dates for different categories of taxpayers.
Story first published: Thursday, January 23, 2020, 20:45 [IST]
Company Search