For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్లాస్టిక్ వేస్ట్ ముప్పు.. కరోనా వల్లే ఎక్కువ, క్లీన్ చేయకపోవడంతో ముప్పు

|

కరోనా వల్ల ప్లాస్టిక్, బయో మెడికల్ వేస్ట్‌‌‌‌ పేరుకుపోతున్నాయి. దేశం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా.. విషపూరిత వ్యర్థాలు పేరుకుపోతూనే ఉన్నాయి. కేసులు భారీగా వస్తుండటంతో ఆస్పత్రుల్లో రోజుకు 2,03,000 కిలోల బయోమెడికల్ వేస్ట్ పోగవుతోంది. దేశంలో గత నెల పోగుబడిన బయోమెడికల్ వేస్ట్‌‌‌‌లో సగం కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ కర్ణాటక నుంచే వస్తోంది.

గత నెలలో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే బయోమెడికల్ వేస్ట్‌‌‌‌ నాన్- కోవిడ్ బయోమెడికల్ వేస్ట్‌‌‌‌లలో సుమారు 33 శాతం ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌‌‌‌మెంట్ 'స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్‌‌‌‌మెంట్ 2021' రిపోర్టులో పేర్కొంది. మే నెలలో పోగైన బయోమెడికల్ వేస్ట్ అంతకుముందు నెలతో పోలిస్తే 46 శాతం ఎక్కువ.

growing plastic waste in india

ఏప్రిల్‌‌‌‌లో రోజుకు 1.39 లక్షల కిలోలకు వేస్ట్ ఉండేది. మార్చిలో రోజూ 75,000 కిలోల ప్లాస్టిక్, బయోమెడికల్ వేస్ట్ తయారయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం.. 2020 జూన్- 2021 మే మధ్య 45,308 టన్నుల కరోనా బయోమెడికల్ వేస్ట్ ఉంది. 2017 లో రోజుకు ఉత్పత్తి అయ్యే బయోమెడికల్ వేస్ట్‌‌‌‌లలో బరువు 5.59 లక్షల కిలోలు దాటలేదు. ఆ సమయంలో రోజూ దాదాపు 519 కిలోల వేస్ట్‌‌‌‌ను శుభ్రం చేసేవారు. 2019 లో రోజు 6.19 లక్షల కిలోల బయోమెడికల్ వేస్ట్‌‌‌‌లను ఉత్పత్తి చేసి, రోజుకు 545 కిలోలను శుద్ధి చేశారు. దేశంలో ఇప్పటికీ 12 శాతం ఆసుపత్రి వేస్ట్‌‌‌‌లను బీహార్, కర్ణాటక రాష్ట్రాలు శుభ్రం చేయకుండా పారబోస్తున్నాయి.

మెడికల్ కల్చర్లు, ఇన్ఫెక్షన్ ఏజెంట్లు, సంబంధిత బయోలాజికల్స్, మనిషి రక్తం, బ్లేడ్ల వంటి పదునైన వస్తువులు, తొలగించిన మానవ శరీర భాగాలు, ఐసోలేషన్ వేస్ట్‌‌‌‌ను బయోమెడికల్ వేస్ట్ అంటారు. వీటిని తగిన రీతిలో శుభ్రం చేయకుంటే, ఇతరులు ముప్పు కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary

ప్లాస్టిక్ వేస్ట్ ముప్పు.. కరోనా వల్లే ఎక్కువ, క్లీన్ చేయకపోవడంతో ముప్పు | growing plastic waste in india

heavily growing plastic waste in india due to coronavirus second wave impact.
Story first published: Sunday, June 6, 2021, 20:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X