For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EPFO: స్వయంఉపాధి పొందేవారికి మోడీ ప్రభుత్వం పీఎఫ్ గుడ్‌న్యూస్!

|

కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అనేక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా, స్వయంఉపాధి పొందుతున్న వారికి సామాజిక భద్రతా పథకాన్ని ప్రారంభించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ సౌకర్యాన్ని స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా అందించేందుకు కసరత్తు చేస్తోంది. దీని వల్ల ఎలాంటి సోషల్ సెక్యూరిటీ స్కీంలో లేని 90 శాతం మంది కవర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పది మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు మాత్రమే ప్రావిడెంట్ ఫండ్ జాబితాలోకి వస్తాయి. అప్పుడే పీఎఫ్ సబ్‌స్క్రిప్షన్, ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీం పొందడానికి అర్హులు.

శుభవార్త, SBI హోమ్‌లోన్ తీసుకునేవారికి అదిరిపోయే న్యూస్: వడ్డీరేట్లపై కీలక ప్రకటనశుభవార్త, SBI హోమ్‌లోన్ తీసుకునేవారికి అదిరిపోయే న్యూస్: వడ్డీరేట్లపై కీలక ప్రకటన

స్వయం ఉపాధి పొందేవారికి గుడ్‌న్యూస్

స్వయం ఉపాధి పొందేవారికి గుడ్‌న్యూస్

డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇతర రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్న చాలామందికి ఈఫీఎఫ్ఓ ప్రయోజనాలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా ఈపీఎఫ్ఓ వర్తించేలా సోషల్ సెక్యూరిటీ స్కీంను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్య వల్ల వివిధ రంగాల్లో స్వయంఉపాధి పొందుతున్న వారు రిటైర్మెంట్ కార్పస్ ఫండ్ నిర్వహిస్తున్న పీఎఫ్ ఆర్గనైజేషన్ సభ్యత్వం పొందగలరు. డాక్టర్లు, లాయర్లు, సీఏలు ఇతర రంగాల్లోని 60 మిలియన్ల మందితో పాటు ఎంతోమందికి ఈపీఎఫ్ఓ వర్తించేలా ఈ స్కీంను తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

సామాజిక భద్రతా కోడ్ బిల్లు

సామాజిక భద్రతా కోడ్ బిల్లు

EPFOను ఎస్టాబ్లిష్‌మెంట్ కేంద్రంగా కాకుండా ఇండివిడ్యువల్ కేంద్రంగా చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. గత ఏడాది లోకసభలో ప్రవేశ పెట్టిన సామాజిక భద్రతా కోడ్ బిల్లుకు ఆమోదముద్ర పడిన తర్వాత ఈపీఎఫ్ఓ స్కీంను విస్తరించే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 8 రకాల లేబర్ చట్టాలు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టాలన్నీ కలిపి సోషల్ సెక్యూరిటీ కోడ్ రూపొందించింది కేంద్రం. దీని వల్ల సోషల్ సెక్యూరిటీ చట్టాలన్నీ ఒకే గొడుకు కిందకు రానున్నాయి. సంస్థల్లో పని చేసే ఉద్యోగులే కాకుండా స్వయంఉపాధి పొందుతున్న వారికి కూడా ఈపీఎఫ్ఓ వర్తించేలా నిర్ణం తీసుకుంటే సోషల్ సెక్యూరిటీ కల్పించడానికి కీలక నిర్ణయం తీసుకున్నట్లవుతుంది.

అమలుకు ప్రభుత్వం ఓకే

అమలుకు ప్రభుత్వం ఓకే

స్వయంఉపాధికి సామాజిక భద్రత ఓ ముఖ్యమైన సమస్యగా మారుతోందని, ఈపీఎఫ్ఓ విస్తరణ ఈ అంతర సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. మీడియాలో వస్తున్న వార్తల మేరకు ఈ పథకాన్ని వ్యక్తిగత చందాదారులకు అందుబాటులో ఉంచాలని కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించగా, ప్రభుత్వం దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. అప్పుడు వ్యక్తికి లేదా స్వయం-ఉపాధి పొందే వారికి ఇది వర్తిస్తుంది. ఈపీఎఫ్ సబ్‌స్కైబర్ల అకౌంట్లోకి ఉద్యోగి వేతనం ప్రకారం యజమాని వాటా 12 శాతం, ఉద్యోగి వాటా 12 శాతంగా ప్రతి నెల జమ అవుతుంది. అలాగే ఉద్యోగులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీం లభిస్తుంది.

English summary

EPFO: స్వయంఉపాధి పొందేవారికి మోడీ ప్రభుత్వం పీఎఫ్ గుడ్‌న్యూస్! | Government mulls options to open up EPFO subscription to self employed

The government plans to open up its key social security scheme — the Employees’ Provident Fund to self-employed individuals, a move that could expand security coverage to more than 90% of workers not falling under any social security scheme at present.
Story first published: Tuesday, September 8, 2020, 14:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X