For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా నుండి భారత్ వరకు అంతే: పెను సంక్షోభం.. ఆర్బీఐ వద్దకు మళ్లీ మోడీ ప్రభుత్వం

|

కరోనా కారణంగా పన్ను వసూళ్లతో పాటు వివిధ కారణాల వల్ల ఫండ్స్ తగ్గి ప్రభుత్వం త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తలుపు తట్టవచ్చునని భావిస్తున్నారు. వైరస్-లాక్ డౌన్ దెబ్బతో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు నేరుగా సావరీన్ బాండ్స్ కొనుగోలు, డివిడెండ్ పెంపు వంటి అంశాలను పరిశీలించవచ్చునని అంటున్నారు. అంచనాల ప్రకారం ప్రభుత్వం జీఎస్టీలో 7 శాతం బడ్జెట్ లోటును ఎదుర్కొంటోంది.

SBI MCLR: ఎస్బీఐ గుడ్‌న్యూస్, వడ్డీ రేట్లు తగ్గింపు... కానీ వారికే!SBI MCLR: ఎస్బీఐ గుడ్‌న్యూస్, వడ్డీ రేట్లు తగ్గింపు... కానీ వారికే!

అమెరికా నుండి వియత్నాం వరకు అదే పరిస్థితి

అమెరికా నుండి వియత్నాం వరకు అదే పరిస్థితి

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (న్యూఢిల్లీ)కి చెందిన ఆర్బీఐ చైర్ ప్రొఫెసర్ సబ్యసాచి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఖర్చులు చేస్తేనే డిమాండ్ పెరుగుతుందన్నారు. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్నీ కుప్పకూలాయి. దీంతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా నుండి జపాన్ వరకు అన్ని దేశాల్లో కేంద్ర బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీతో సహకరిస్తున్నాయి. ఇండోనేషియా వంటి దేశాల్లో సెంట్రల్ బ్యాంకు ప్రభుత్వం నుండి నేరుగా బిలియన్ డాలర్ల బాండ్స్ కొనుగోలు చేయడానికి అంగీకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకులు ఏదో విధంగా ఆదుకుంటున్నాయి. అదే విధంగా భారత్‌లో కూడా ఏదో ఒక రకంగా ఆర్బీఐ నుండి కేంద్రం రుణం తీసుకోవచ్చు.

బాండ్స్ కొనుగోలును నిరోధించినప్పటికీ...

బాండ్స్ కొనుగోలును నిరోధించినప్పటికీ...

భారత్ ఆర్థిక బాధ్యతలు, బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రభుత్వం నుండి ఆర్బీఐ నేరుగా బాండ్స్ కొనుగోలు చేయడాన్ని నిరోధిస్తుంది. కానీ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో (జాతీయ విపత్తులు లేదా తీవ్రమైన మందగమనం) ఇలా కొనుగోలు చేసే వెసులుబాటును కల్పిస్తుంది. ఆర్బీఐ సెకండరీ మార్కెట్లో బాండ్స్ కొనుగోళ్లు చేసింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం గట్టెక్కాలంటే రూ.12 ట్రిలియన్ రుణాలు అవసరం. ప్రస్తుతం బ్యాంక్స్ సావరీన్ బాండ్స్ ద్వారా సమీకరిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో రుణాల కోసం పేలవమైన డిమాండ్ ఉంది.

రేటింగ్ ఏజెన్సీలు, ఐఎంఎఫ్ అంచనాల ఆందోళన

రేటింగ్ ఏజెన్సీలు, ఐఎంఎఫ్ అంచనాల ఆందోళన

క్రెడిట్ రేటింగ్ తగ్గించడం భారత్‌కు రిస్క్‌గా భావించవచ్చు. ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ క్రెడిట్ రేటింగ్‌ను రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, మూడీస్ భారీగా తగ్గించాయి. ఈ సంవత్సరం భారత ఆర్థిక లోటు జీడీపీలో 7 శాతానికి చేరుకుంటుందని బ్లూమ్ బర్గ్ సర్వే అంచనా వేసింది. కరోనా కారణంగా 1994 తర్వాత మళ్లీ ఆ పరిస్థితి కనిపిస్తోంది. జీడీపీలో భారత్ రుణాలు ప్రస్తుతం 70 శాతంగా ఉండగా ఇది 85.7 శాతానికి చేరుకోవచ్చునని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది.

ప్రభుత్వాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు..

ప్రభుత్వాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు..

ప్రభుత్వం ఆర్థికంగా చిక్కుపోతున్న నేపథ్యంలో అమెరికా, జపాన్, వియత్నాం సహా ప్రపంచ దేశాల్లోని కేంద్ర బ్యాంకుల మాదిరి ఆర్బీఐ కూడా భారత ప్రభుత్వాన్ని గట్టెక్కించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు ప్రభుత్వం నుండి నేరుగా బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. ఆగస్ట్ నెలలో డివిడెండ్ చెల్లింపు ద్వారా మరింత ఊరట కల్పించవచ్చునని భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఆర్బీఐ గట్టెక్కించాల్సిన అవశ్యకత ఉందని సొసిట్ జనరల్ జీఎస్సీ ప్రయివేట్ లిమిటెడ్ ఆర్థికవేత్త కునాల్ కుందు అన్నారు. ప్రభుత్వం స్పెషల్ కోవిడ్ బాండ్స్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

డివిడెండ్

డివిడెండ్

ఈ ఏడాది కేంద్ర బ్యాంకు నుండి రూ.600 బిలియన్ల డివిడెండ్ వస్తుందని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. గత ఏడాది చెల్లింపులు రూ.1.76 ట్రియిన్లు అందుకుంది. తన పెట్టుబడులు, కరెన్సీ నోట్లు ముద్రించడం ద్వారా వచ్చే లాభాల ఆధారంగా ప్రతి ఏడాది ప్రభుత్వానికి ఆర్బీఐ డివిడెండ్ చెల్లిస్తుంది.

English summary

అమెరికా నుండి భారత్ వరకు అంతే: పెను సంక్షోభం.. ఆర్బీఐ వద్దకు మళ్లీ మోడీ ప్రభుత్వం | Government is running out of options to fund its budget and may soon have to knock RBI's door

India’s government is running out of options to fund its budget and may soon have to knock on the central bank’s door once again for support.
Story first published: Wednesday, July 8, 2020, 20:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X