For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Free Gas Cylinders: రేషన్ కార్డ్ హోల్డర్లకు శుభవార్త.. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు..!

|

Free Gas Cylinders: రేషన్ కార్డ్ హోల్డర్లకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం చాలా అరుదు. కానీ దేశంలోని ఒక రాష్ట్రం మాత్రం తమ ప్రజలకు ఏకంగా 3 సిలిండర్లు ఇస్తామని శుభవార్త ప్రకటించింది. పండుగల సీజన్లో పెరుగుతున్న ఖర్చులను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు. చాలా మంది ప్రభుత్వం అందించనున్న ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎగబడుతున్నారు.

ఉచితంగా సిలిండర్లు..

ఉచితంగా సిలిండర్లు..

ఉత్తరాఖండ్‌లోని ధామి ప్రభుత్వం తమ రాష్ట్రంలోని రేషన్ కార్డు హోల్డర్లకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఉత్తరాఖండ్ వాసులకు ఏడాదిలో మూడు ఉచిత సిలిండర్లు పొందవచ్చని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అంత్యోదయ రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు 3 సార్లు గ్యాస్ సిలిండర్లను రీఫిల్ చేయడానికి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

అవసరమైన అర్హతలు..

అవసరమైన అర్హతలు..

* లబ్ధిదారు ఉత్తరాఖండ్ నివాసి అయి ఉండాలి

* వ్యక్తి అంత్యోదయ రేషన్ కార్డును కలిగి ఉండాలి

* అంత్యోదయ రేషన్ కార్డును గ్యాస్ కనెక్షన్ కార్డుకు లింక్ చేయాలి

* లబ్ధి పొందటానికి రేషన్ కార్డు హోల్డర్లు వీలైనంత త్వరగా లింకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి

ఏ నెలలో సిలిండర్లు ఇస్తారు..?

ఏ నెలలో సిలిండర్లు ఇస్తారు..?

ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం అంత్యోదయ కార్డు హోల్డర్లు ఏప్రిల్- జూలై మధ్య మొదటి సిలిండర్ పొందుతారు. ఆ తర్వాత ఆగస్టు-నవంబర్ మధ్య రెండో సిలిండర్, డిసెంబర్-మార్చి మధ్య మూడో సిలిండర్ పొందుతారని వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా 2 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం రూ.55 కోట్లను వెచ్చిస్తోంది. ఈ నిర్ణయం వల్ల పేద కుటుంబాలకు గ్యాస్ భారం నుంచి కొంత ఉపశమనం లభించనుంది.

English summary

Free Gas Cylinders: రేషన్ కార్డ్ హోల్డర్లకు శుభవార్త.. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు..! | government giving 3 gas cylinders for free to ration card holders in uttarakhand

government giving 3 gas cylinders for free to ration card holders in uttarakhand
Story first published: Friday, October 7, 2022, 13:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X