For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట

|

పన్ను చెల్లింపుదార్లకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. తక్కువ మొత్తం ఉన్న అన్ని విత్ హోల్డింగ్ పన్ను ఆదేశాల చెల్లుబాటును మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సున్నా లేదా తక్కువ టీడీఎస్, టీసీఎస్‌ల దరఖాస్తులు పెండింగులో ఉంటే జూన్ 30వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.

ఇబ్బంది లేకుండా 10 బ్యాంకుల విలీనం, చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంక్ఇబ్బంది లేకుండా 10 బ్యాంకుల విలీనం, చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంక్

మదింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి మినహాయింపు ధృవపత్రానికి దరఖాస్తు చేసుకోకుంటే గత ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన ధృవపత్రాలే ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది.

Government extends validity of lower withholding tax orders till June 30

కరోనా నేపథ్యంలో అన్ని తక్కువ విత్ హోల్డింగ్స్ పన్ను ఉత్తర్వుల చెల్లుబాటును జూన్ 30 వరకు పొడిగించింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా 44వేల మందికి పైగా ఈ మహమ్మారి వల్ల మృత్యువాత పడ్డారు. ఇండియాలో 1640 కేసులు నమోదు కాగా, 45 మంది మృత్యువాత పడ్డారు. దీని వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్‌తో జాగ్రత్తలు తీసుకుంది. ఇది ప్రజలను ఇంటికే పరిమితం చేయడంతో కేంద్రం అన్ని అంశాలలో వెసులుబాటు కల్పిస్తోంది.

English summary

పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట | Government extends validity of lower withholding tax orders till June 30

CBDT gave a major relief to taxpayers whose application for lower or nil deduction of TDS/TCS is pending for disposal
Story first published: Wednesday, April 1, 2020, 21:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X