For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ మరో భారీ డీల్, జియోలో గూగుల్ భారీ పెట్టుబడి?

|

రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం అమెరికా టెక్ దిగ్గజం క్వాల్‌కాం కూడా ఇన్వెస్ట్ చేసింది. ఫేస్‌బుక్‌తో ప్రారంభమైన మెగా డీల్స్.. 13 దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. సెర్చింజన్ గూగుల్ కూడా భారీగా పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ కంపెనీతో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ వ్యాల్యూ 4 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి. దీనిపై రిలయన్స్, గూగుల్ స్పందించాల్సి ఉంది.

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఇప్పటికే 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది. కరోనా మహమ్మారి వంటి క్లిష్ట సమయంలో రుణరహిత కంపెనీగా నిలిచింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గతంలో జియోలో పెట్టుబడులను ఖండించలేదు, అలాగని ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పలేదు. నిన్న ప్రధాని మోడీతో జరిగిన వర్చువల్ భేటీ అనంతరం సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. ఇండియాలో 10 బిలియన్ డాలర్లు డిజిటల్ ఇండియా కోసం ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. రానున్న అయిదు నుండి ఏడేళ్లలో ఈ పెట్టుబడులు పెట్టనుంది గూగుల్. ఇందులో నుండి జియోలో ఇన్వెస్ట్ చేయనున్నారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Google reportedly in advanced talks to invest $4 billion in Jio

13 వరుస పెట్టుబడులు

- ఏప్రిల్ 22 - ఫేస్‌బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా
- మే 3 - సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా
- మే 8 - విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- మే 17 - జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా
- మే 22 - కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- జూన్ 5 - ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా
- జూన్ 5 - సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా
- జూన్ 7 - ADIA - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా
- జూన్ 13 - TPG - రూ.4,546.8 కోట్లు - 0.93 శాతం వాటా
- జన్ 13 - ఎల్-కేటర్టన్ - రూ.1,894.50 కోట్లు - 0.39 శాతం వాటా
- జూన్ 18 - PIF - రూ.11,367 కోట్లు - 2.32 శాతం వాటా
- జూలై 3 - ఇంటెల్ - రూ.1,894.5 కోట్లు - 0.39 శాతం వాటా
- జూలై 12 - క్వాల్‌కామ్ - రూ.730 కోట్లు - 015 శాతం వాటా

English summary

రిలయన్స్ మరో భారీ డీల్, జియోలో గూగుల్ భారీ పెట్టుబడి? | Google reportedly in advanced talks to invest $4 billion in Jio

Google is in advanced talks to buy a stake in Reliance Industries digital arm Jio Platforms, according to a report by Bloomberg. An announcement could come as soon as the next few weeks, the agency said quoting people familiar with the matter.
Story first published: Tuesday, July 14, 2020, 20:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X