For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీస్‌కు రావొద్దు: కొత్త ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఇలా నిర్వహిస్తోన్న గూగుల్

|

చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయనే అంచనాలు ఉన్నాయి. చమురు సహా వివిధ కంపెనీలపై ప్రభావం పడింది. ఐటీ కంపెనీలు దెబ్బతింటున్నాయి. టెక్ దిగ్గజాలు సహా ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి.

కరోనా వైరస్ దెబ్బ, మరిన్ని కథనాలు

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సెర్చింజన్ గూగుల్ అప్రమత్తమైంది. సిలికాన్‌వ్యాలి, శాన్‌ప్రాన్సిస్కో, న్యూయార్క్‌లలోని తమ ఆఫీస్‌లకు వచ్చే సందర్శకులను కట్టడి చేస్తోంది. తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసుకునే వెసులుబాటు కల్పించింది.

సాఫ్టువేర్ అభివృద్ధి సమావేశాలు రద్దు

సాఫ్టువేర్ అభివృద్ధి సమావేశాలు రద్దు

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమే కాదు. కొత్త ఉద్యోగులను చేర్చుకుంటుంది. అయితే కరోనా వైరస్ కారణంగా వారికి నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు. ఆఫీస్‌లకు ఉద్యోగార్థులను నిలిపివేసింది. అంతేకాదు, తమ సాఫ్టువేర్ అభివృద్ధి సమావేశాలను కూడా రద్దు చేసుకుంటోంది. కార్యాలయాలకు వచ్చే వారిని కట్టడి చేసింది.

హ్యాంగవుట్ ఇంటర్వ్యూలు

హ్యాంగవుట్ ఇంటర్వ్యూలు

కొత్త ఉద్యోగులను చేర్చుకునేందుకు గూగుల్ ఇంటర్వ్యూలు చేస్తోంది. కానీ నేరుగా చేయడం లేదు. గూగుల్ హ్యాంగవుట్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. యాపిల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాయి. ఈ వారం నుంచి ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయాలని ఆపిల్ తెలిపింది. ట్విట్టర్ సోమవారం నుంచే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అందుబాటులోకి తెచ్చింది.

లింక్డిన్ వర్చువల్ ఇంటర్వ్యూలు

లింక్డిన్ వర్చువల్ ఇంటర్వ్యూలు

గూగుల్ సంస్థ మార్చి 4 నుండే వర్చువల్ ఇంటర్వ్యూలు ప్రారంభించింది. లింక్డిన్ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది. వివిధ కంపెనీలు అత్యవసరం కాకుంటే ఇంటర్వ్యూలు పోస్ట్ పోన్ చేయడం లేదా అవసరమైతే హ్యాంగవుట్, వర్చువల్ ద్వారా నిర్వహిస్తున్నాయి.

English summary

ఆఫీస్‌కు రావొద్దు: కొత్త ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఇలా నిర్వహిస్తోన్న గూగుల్ | Google moves all job interviews to Hangouts

Google has begun informing prospective job candidates that it will be moving all interviews globally to Google Hangouts or BlueJeans due to coronavirus, according to an email sent to one applicant from the Google staffing team.
Story first published: Wednesday, March 11, 2020, 12:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X