For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

android: అండ్రాయిడ్ ఫోన్లలో భారీ మార్పులు చేసిన గూగుల్.. అవేంటో ఓ లుక్కేయండి !!

|

android: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారతదేశం. అండ్రాయిడ్ ఆధారిత ఫోన్లను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇదే అదనుగా ఇన్నాళ్లూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించిన గూగుల్‌ కు CCI, సుప్రీంకోర్టు గట్టి ఝలక్ ఇచ్చాయి. టెక్ దిగ్గజం నిబంధనలను వినియోగదారులు, యాప్ డెవలపర్లు పాటించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అందుకు అనుగుణంగా OSలో మార్పులు చేయాలని ఆదేశించింది. తద్వారా స్మార్ట్ ఫోన్లలో కొత్తగా జరగనున్న మార్పులేంటో చూద్దాం..

సెర్చ్ ఇంజిన్ ఎంపిక

సెర్చ్ ఇంజిన్ ఎంపిక

ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంటర్‌ నెట్‌ లో ఏమైనా సమాచారం వెతకాలంటే డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌ గా గూగుల్ ఉంటోంది. కానీ ఇప్పుడు ఏ సర్వీస్ ద్వారా సమాచారం శోధించాలనేది పూర్తిగా వినియోగదారుని ఐచ్ఛికం కానుంది. ప్రస్తుతం ఈ అవకాశం ఉన్నా.. వినియోగించుకోవాలంటే సెట్టింగ్స్‌ లోపలికి వెళ్లి పలు మార్పులు చేయాల్సి ఉంది. ఈ తరహా మార్పులను యూరప్ దేశాల్లో ఇప్పటికే గూగుల్ అమలు చేస్తోంది.

ఫోర్క్‌ డ్‌ ఆపరేటింగ్ సిస్టమ్స్

ఫోర్క్‌ డ్‌ ఆపరేటింగ్ సిస్టమ్స్

ఈ మార్పు ద్వారా ఫోన్ తయారీదారులు.. ఆమోదించబడిన అండ్రాయిడ్ ఫోర్క్‌డ్ వెర్షన్‌ లను రూపొందించే వెసులుబాటు లభిస్తుంది. తద్వారా భారత్‌ లో స్థానికంగా తయారు చేయబడిన BharOS ఇన్‌ స్టాల్‌ చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ రూపొందించే మార్కెట్‌ లో భారీ పోటీకి తెరతీసినట్లే. అండ్రాయిడ్ ఓపెన్‌ సోర్స్ అయినా.. యాంటీ-ఫ్రాగ్మెంటేషన్ ఒప్పందాలు (AFA) అమలు చేయాలని గూగుల్ ఇప్పటి వరకు స్మార్ట్‌ ఫోన్ల తయారీదారులపై ఒత్తిడి తెచ్చేది. అంటే AFA మీద సంతకం చేస్తే గూగుల్ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే అన్నమాట.

వ్యక్తిగత Google యాప్‌లకు లైసెన్స్

వ్యక్తిగత Google యాప్‌లకు లైసెన్స్

దేశంలోని స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఇప్పుడు వ్యక్తిగత Google యాప్‌లకు లైసెన్స్ ఇవ్వగలరు. గతంలో Gmail, Google Maps మరియు Google Play Store ఇన్‌స్టాల్ చేయడానికి Google Mobile Services (GMS) లైసెన్స్ తప్పదు. ఇప్పటి నుంచి గంపగుత్తగా అనవసరమైన యాప్‌ లన్నీ ఇన్‌ స్టాల్ చేయకుండా.. కావాల్సిన వాటికి మాత్రమే లైసెన్స్ ఇవ్వచ్చు. GMS లైసెన్సింగ్ ఫీజు తగ్గడం వల్ల చౌక ధరలకే ఫోన్లను అందించే అవకాశం లభిస్తుంది.

యాప్‌ల సైడ్ లోడింగ్

యాప్‌ల సైడ్ లోడింగ్

Google Play Store నుంచే కాకుండా ఇతర మార్గాల ద్వారా యాప్‌ల ఇన్‌స్టాలేషన్ అండ్రాయిడ్‌ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ విధంగా సైడ్‌లోడ్ చేయబడిన యాప్‌లను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌లు కూడా ప్లే స్టోర్ చేస్తున్న విధంగానే ఆటోమేటిక్ యాప్ అప్‌డేట్‌లను అందించగలవు. అయితే భద్రతా ప్రమాదాలను వినియోగదారులు ముందుగా గుర్తించాల్సి ఉంటుందని Google హెచ్చరించింది.

ప్లే స్టోర్ బిల్లింగ్

ప్లే స్టోర్ బిల్లింగ్

యాప్‌ స్టోర్‌ లో కొనుగోళ్లు చేసేటప్పుడు దేశంలోని వినియోగదారులు Google Play కాకుండా ఇతర బిల్లింగ్ సిస్టమ్‌ను ఎంచుకోవడానికి Google అనుమతిస్తుంది. లాభాల్లో ఎక్కువ వాటాను పొందేందుకు యాప్, గేమ్ డెవలపర్‌లకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. సేవా రుసుమును మాత్రమే Google వసూలు చేస్తుంది.

English summary

android: అండ్రాయిడ్ ఫోన్లలో భారీ మార్పులు చేసిన గూగుల్.. అవేంటో ఓ లుక్కేయండి !! | Google made changes to android os per CCI, supreme court directions

changes in andorid phone OS
Story first published: Saturday, January 28, 2023, 9:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X