For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Layoffs: మనుషులనే కాదు రోబోల ఉద్యోగాలూ పోతున్నాయ్.. గూగుల్ ఏం చేసిందంటే..

|

Google Layoffs: మాంద్యం కారణంగా ఆర్థికంగా కంపెనీని అగాథంలోకి జారిపోకుండా కాపాడుకునేందుకు గూగుల్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో భారీగా ఉద్యోగులను తొలగించిన తర్వాత తాజాగా గూగుల్ మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సారి ఉద్యోగాలను కోల్పియింది మనుషులు కాదు రోబోలు కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రోబోలకు లేఆఫ్..

రోబోలకు లేఆఫ్..

గూగుల్ యాజమాన్యం రోబోలను లేఆఫ్ చేయటం వల్ల ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న దాదాపు 200 మంది ఉద్యోగాలు ప్రభావితం కానున్నాయి. గూగుల్ 2019లో ఎవ్రీడే రోబోస్ పేరుతో చేపట్టిన ప్రాజెక్ట్ కింగద 100 రోబోట్లను అభివృద్ధి చేసింది. అయితే ఆల్ఫాబెట్ ఇప్పుడు రెస్టారెంట్ టేబుల్‌లను శుభ్రం చేయడానికి, చెత్తను సేకరించడానికి, తలుపులు తెరవడానికి ఉపయోగించే రోబోట్‌లను దశలవారీగా తొలగించింది. దీని ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. కరోనా సమయంలో కంపెనీ వీటిని ఎక్కువగా వినియోగించిందని తెలుస్తోంది.

ఆఫీస్ స్పేస్..

ఆఫీస్ స్పేస్..

రోజువారీ నిర్వహణ ఖర్చులను తగ్గించటంలో భాగంగా గూగుల్ ఇటీవల తన కార్యాలయాలను లీజుకు ఇచ్చింది. ఈ క్రమంలో 'రియల్ ఎస్టేట్ ఎఫిషియన్సీ'ని పెంచేందుకు ఇటీవల ఉద్యోగులకు ఇచ్చిన పర్మినెంట్ సీట్లను తొలగించి రొటేషన్ పద్ధతిలో వాటిని వినియోగిస్తోంది. దీనివల్ల తక్కువ కార్యాలయ స్పేస్ అత్యుత్తమంగా వినియోగించవచ్చని కంపెనీ యోచిస్తోంది.

ప్రాజెక్ట్ నిలిపివేత..

ప్రాజెక్ట్ నిలిపివేత..

ఎవ్రీడే రోబోట్స్‌ ప్రాజెక్ట్‌ లాభదాయకం కాదని, పైగా అధిక ఖర్చులకు కారణమౌతోందని గూగుల్ యాజమాన్యం భావించిన తరుణంలో ఈ ప్రాజెక్టును నిలిపివేసింది. Google రీసెర్చ్‌లో కొన్ని సాంకేతికతలు మరియు ప్రాజెక్ట్ టీమ్‌లు ఏకీకృతం చేయబడడంతో ఎవ్రీడే రోబోట్‌లు ఇకపై ఆల్ఫాబెట్ ప్రోగ్రామ్‌లో భాగం కావని అడ్వర్టైజింగ్ & కమ్యూనికేషన్స్ డైరెక్టర్ డెనిస్ గంబోవా వెల్లడించారు.

హైదరాబాద్ - బెంగళూరు

హైదరాబాద్ - బెంగళూరు

లేఆఫ్‌లలో నేరుగా మేనేజర్‌ల క్రింద పని చేయని ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో లెవల్ 4 సాఫ్ట్‌వేర్ డెవలపర్, బ్యాకెండ్ డెవలపర్, క్లౌడ్ ఇంజనీర్, డిజిటల్ మార్కెటర్ ఉద్యోగులను గూగుల్ తొలగించిందని సమాచారం. ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో గూగుల్ మాత్రమే కాక.. ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ వంటి చాలా కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

English summary

Layoffs: మనుషులనే కాదు రోబోల ఉద్యోగాలూ పోతున్నాయ్.. గూగుల్ ఏం చేసిందంటే.. | Google layoffs its everyday robots division amid cost cutting measures

Google layoffs its everyday robots division amid cost cutting measures
Story first published: Sunday, February 26, 2023, 11:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X