For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google layoffs: పేరుకే పెద్ద కంపెనీలు.. పీకేయడంలోనూ పోటీనే.. పాపం ఉద్యోగులు !!

|

Google layoffs: వివిధ టెక్నాలజీల్లో మైక్రోసాఫ్ట్ తో పోటీపడుతున్న గూగుల్.. ఉద్యోగుల తొలగింపుల్లోనూ అలాగే వ్యవహరిస్తోంది. మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని తొలగించిన రోజుల వ్యవధిలోనే దాదాపు 12 వేల ఉద్యోగాలు కోత విధించనున్నట్లు గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ ప్రకటించింది. తన మొత్తం శ్రామిక శక్తిలో ఇది 6 శాతమని వెల్లడించింది.

పొగుడుతూనే పంపేస్తున్నారు

పొగుడుతూనే పంపేస్తున్నారు

సెర్చ్‌ ఇంజిన్, యూట్యూబ్, క్రోమ్, అండ్రాయిడ్ వంటి వివిధ సాంకేతికల ద్వారా కోట్ల మందికి గూగుల్ చేరువైనట్లు.. అంతర్గత మెయిల్‌ లో కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. వాటి సక్సెస్‌ లో ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. ఎంతో మంది ప్రతిభావంతులను తొలగించాల్సి రావడం బాధాకరమన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

మాంద్యమే ముంచేసింది

మాంద్యమే ముంచేసింది

సంస్థ ఉత్పత్తులు, ఉద్యోగులు, వారి ప్రాధాన్యతను పరిగణలోనికి తీసుకుని 12 వేల మందిని తొలగించాలని నిర్ణయించినట్లు సుందర్ వెల్లడించారు. వేగంగా మారుతున్న భౌగోళిక, ఆర్థిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని కొంతమందిపై వేటు వేయనున్నట్లు చెప్పారు. వేలాది మంది గూగుల్ ఉద్యోగుల జీవితాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

చావు కబురు చల్లగా..

చావు కబురు చల్లగా..

కోత విధించనున్న ఉద్యోగుల్లో మానవ వనరులు, ఇంజనీరింగ్, ప్రొడక్షన్ సహా పలు విభాగాలకు చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఈ కోతలను వెంటనే అమలు చేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. వివిధ దేశాల్లోని స్థానిక చట్టాల ప్రకారం ముందుకు సాగడానికి కొంత సమయం పడుతుందని వెల్లడించింది. ఇప్పటికే బాధిత ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపింది.

English summary

Google layoffs: పేరుకే పెద్ద కంపెనీలు.. పీకేయడంలోనూ పోటీనే.. పాపం ఉద్యోగులు !! | Google laid off 12 thousand employees

Google layoffs 12 thousand employees..
Story first published: Saturday, January 21, 2023, 7:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X