గూగుల్, ఆపిల్ తమ స్టోర్ నుంచి ఓ యాప్‌ను తొలగించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ToTok యాప్‌ను తొలగించాయి. ఈ యాప్ యూఏఈకి స్పైగా పని చేస్తోందనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే వారి కదలికలు, ఇతర సమాచారాన్ని యూఏఈ ప్రభుత్వానికి పంపిస్తోందని వార్తలు వచ్చాయి. దీంతో ఈ యాప్‌ను తొలగించాయి.
తమ యాప్‌ను టెక్నికల్ సమస్యల కారణంగా ప్రస్తుతం ఆపిల్ స్టోర్, గూగుల్ స్టోర్ నుంచి తొలగించారని ToTok పేర్కొంది. గూగుల్ గత గురువారం ఈ యాప్‌ను తొలగించింది. ఈ యాప్ తమ విధానాలకు భిన్నంగా ఉందని పేర్కొంది. మరోవైపు దీనిపై దర్యాఫ్తు చేస్తున్నట్లు ఆపిల్ తెలిపింది. ఈ యాప్ ఓనర్‌కు అబుదాబీలోని ఓ హ్యాకింగ్ కంపెనీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. దీనిపై ఎఫ్‌బీఐ కూడా దర్యాఫ్తు చేస్తోంది.

ఈ యాప్ చాలా నెలలుగా ఉపయోగిస్తున్నారు. మిడిల్ ఈస్ట్, యూరోప్, ఆసియా, ఆప్రికా, నార్త్ అమెరికా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. గూగుల్ ఈ యాప్‌ను తొలగించడానికి ముందే 5 మిలియన్ ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇక, యాప్ ట్రాకర్ ఆప్-యాన్నీ ప్రకారం గత వారం అమెరికాలో ఎక్కువగా డౌన్ లోడ్ అయిన యాప్ ToTok కావడం గమనార్హం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications